Congress Manifesto
Congress Manifesto: తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక మ్యానిఫోస్టో ప్రకటించింది. ఐదు విలీన గ్రామాలను తెలంగాణలో తిరిగి కలుపుతామని తెలిపింది. ఢిల్లీ నుంచి న్యాయ్ పత్ర పేరుతో మ్యానిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసి మ్యానిఫెస్టోను విడుదల చేశారు.
రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో పోలవరం ముంపు మండలాలు కలిసిన విషయం తెలిసిందే. భద్రాచలం చుట్టుపక్కల ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలుపుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఎటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నియగూడెం, పిచుకలపాడు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలుపుతామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.
కాగా, దేశంలో తామ అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని కాంగ్రెస్ తెలిపింది. మహాలక్ష్మీ పథకం ద్వారా దేశంలోని ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రూ.లక్ష నగదు ఇస్తామని తెలిపింది. దేశంలోని యువతకు 30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పింది. కులగణన చేస్తామని, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 50 శాతం రిజర్వేషన్స్ ఇస్తామని, రైతు రుణమాఫీ చేస్తామని తెలిపింది.
Also Read: న్యాయ్‌పత్ర పేరుతో కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల