Lok Sabha elections 2024: న్యాయ్‌పత్ర పేరుతో కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల
ఢిల్లీ నుంచి న్యాయ్ పత్ర పేరుతో మ్యానిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసి మ్యానిఫెస్టోను విడుదల చేశారు.

Congress Party releases its manifesto for the 2024 Lok Sabha elections at AICC headquarters in Delhi
కాంగ్రెస్ పార్టీ ఇవాళ లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసింది. ఢిల్లీ నుంచి న్యాయ్ పత్ర పేరుతో మ్యానిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసి మ్యానిఫెస్టోను విడుదల చేశారు. 48 పేజీలతో ఈ మ్యానిఫెస్టోను రూపొందించారు.
ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, సంక్షేమంపై ప్రధానంగా దృష్టి పెట్టి కాంగ్రెస్ మ్యానిఫెస్టోను రూపొందించినట్లు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తెలిపారు. బీజేపీ పాలనలో దేశంలో ప్రజలకు ఎలాంటి న్యాయమూ జరగలేదని చెప్పారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి, అధికారంలోకి వచ్చి ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తుందని అన్నారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని ముఖ్యాంశాలు
- పీఎంఎల్ఏ, సీఏఏ రద్దు
- ఓబీసీ వర్గాలకు ఉన్నత విద్య కోసం రిజర్వేషన్లు
- ఐపీసీ, సీఆర్సీపీ ఎవిడెన్స్ చట్టాల రద్దు
- రూ.5 వేల కోట్లతో యువతకు స్టార్టప్ ఫండ్
- విద్యా రుణాల వడ్డీ రేట్ల తగ్గింపు
- వ్యవసాయ వస్తువులపై జీఎస్టీ రద్దు
- రైతులకు కనీస మద్దతు ధరపై హామీ
- అగ్నివీర్ స్కీమ్ రద్దు
- ఆర్మీలో అమలులోకి మళ్లీ పాత రిక్రూట్మెంట్ స్కీమ్
- రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ
- పేద మహిళలకు సంవత్సరానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం
- ఉపాధి హామీ వేతనం రూ. 400
- రైతులకు రుణమాఫీ , పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత
- 5 వేల కోట్ల రూపాయలతో యువత కోసం ప్రత్యేక నిధి
- కులగణన ఆధారంగా రిజర్వేషన్‌లు అమలు
- 450 రూపాయలకే గ్యాస్ సిలిండర్
- ప్రభుత్వ పరీక్షలు, ప్రభుత్వ పోస్టులకు దరఖాస్తు ఫీజుల రద్దు
#WATCH | Congress Party releases its manifesto for the 2024 Lok Sabha elections, at AICC headquarters in Delhi.
#LokSabhaElections2024 pic.twitter.com/lNZETTLDLY
— ANI (@ANI) April 5, 2024