Telangana Rains: తెలంగాణలో పూర్తిగా మారిపోయిన వాతావరణం.. 3 రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో తెలంగాణ(Telangana Rains) వ్యాప్తంగా వాతావరణంలో ఒక్కసారిగా తీవ్ర మార్పులు సంభవించాయి.

Meteorological Department forecasts heavy rain in Telangana for next three days.

  • తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు
  • పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
  • వాతావరణ శాఖ జాగ్రత్త సూచనలు

Telangana Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వాతావరణంలో ఒక్కసారిగా తీవ్ర మార్పులు సంభవించాయి. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాలతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు, అధికారులు ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Indiramma Indlu 2 Phase: ‘ఇందిరమ్మ ఇళ్ల’ రెండో విడతపై బిగ్ అప్డేట్.. 2.5 లక్షల కొత్త ఇళ్లు కేటాయింపు.. లాస్ట్ డేట్ ఇదే!

ఈ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువ:

రానున్న 72 గంటల్లో ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై వర్షాల(Telangana Rains) ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉండటంతో వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి, సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఈదురుగాలులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.

ఉరుములు, మెరుపులతో జాగ్రత్త:

వర్షాల సమయంలో ఉరుములు, మెరుపులు ఉధృతంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు వర్షం పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదని స్పష్టం చేశారు. పాత భవనాలు, భారీ హోర్డింగ్‌ల కింద వాహనాలు నిలపవద్దని, అత్యవసరమైతే తప్ప వర్షం పడే సమయంలో బయటకు రావద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.