×
Ad

Rain Alert : రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ..

Rain Alert మరో అల్పపీడనం భూ మధ్య రేఖా ప్రాంతంలో భారీగా ఏర్పడనుంది. 7వ తేదీన అది ఏర్పడవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Rain Alert

Rain Alert : మొంథా తుపాను ప్రభావంతో ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం మొంథా తుపాను ప్రభావం నుంచి కోలుకుంటున్నారు. ఇలాంటి సమయంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. రానున్న రోజుల్లో అతి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే, ప్రస్తుతం అల్పపీడనం ముప్పు తప్పింది.. కానీ.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

బంగాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మయన్మార్ తీరాన్ని తాకింది. కానీ, అది 5వ తేదీన తిరిగి సముద్రంలోకి రానుంది. అయితే, ప్రస్తుతానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు దానివల్ల ప్రభావం లేదు. కానీ, మరో అల్పపీడనం భూ మధ్య రేఖా ప్రాంతంలో భారీగా ఏర్పడనుంది. 7వ తేదీన అది ఏర్పడవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు బంగాళాఖాతంలో మూడు ద్రోణులు ఉన్నాయి. వాటిలో ఏదైనా ఎక్కువ యాక్టివ్ అయితే ఆవర్తనంగా మారి.. అల్పపీడనంగా ఏర్పడవచ్చు. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది. ఇదిలాఉంటే.. ఇవాళ తెలంగాణలో విభిన్న వాతావరణ ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Also Read: జూబ్లీహిల్స్‌లో కీలకంగా ఆ ఓటర్లు.. బైపోల్‌లో టీడీపీ సానుభూతిపరులు ఎవరికి జై కొడతారు?

తెలంగాణలో ఇవాళ (మంగళవారం) వాతావరణం పొడిగా.. కాస్త ఎండగా ఉంటుందని, మధ్యాహ్నం తరువాత ఆకాశం మేఘావృతమై రాత్రి వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. మిగిలిన ప్రాంతాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇవాళ ఉదయం కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి – భోంగీర్, నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, సంగారెడ్డి, రంగారెడ్డి, జనగాం తదితర ప్రాంతాల్లోనూ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.