Kishan Reddy : జూబ్లీహిల్స్‌లో మేమే కింగ్ అవుతాం.. మాకు సర్వేలు అవసరం లేదు.. : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy : జూబ్లీహిల్స్‌లో మేమే కింగ్ అవుతాం.. కింగ్ మేకర్స్ అయ్యే స్టేజ్ దాటిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

Kishan Reddy : జూబ్లీహిల్స్‌లో మేమే కింగ్ అవుతాం.. మాకు సర్వేలు అవసరం లేదు.. : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy

Updated On : November 3, 2025 / 2:17 PM IST

Kishan Reddy : జూబ్లీహిల్స్‌లో మేమే కింగ్ అవుతాం.. కింగ్ మేకర్స్ అయ్యే స్టేజ్ దాటిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో టీడీపీ శ్రేణులు కూడా ఎన్డీయే భాగస్వామిలో భాగంగా పనిచేస్తున్నారు. జనసేన, టీడీపీ శ్రేణులు వాలెంటరీగా పని చేస్తున్నాయి. ఎవరికి వారు గెలవాలని కోరుకోవడం తప్పు లేదు.. కానీ విమర్శలకు పరిమితం ఉండాలని కిషన్ రెడ్డి అన్నారు.

Also Read: Chevella Bus Incident : చేవెళ్ల బస్సు ప్రమాదం.. టిప్పర్ ఢీకొట్టినదానికంటే కూడా దీని వల్ల ఎక్కువమంది చనిపోయారు.. పాపం..

జూబ్లీహిల్స్ ఎన్నికలకు పాకిస్థాన్‌కు లింక్ చేసి మాట్లాడుతున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోతే బియ్యం రావు అంటున్నారు. సన్న బియ్యంలో 42 రూపాయలు కేంద్ర ప్రభుత్వానివి. రాష్ట్ర ప్రభుత్వం వాటా 16 రూపాయలు అంటూ కిషన్ రెడ్డి గుర్తు చేశారు.

జూబ్లీ‌హిల్స్ ఉపపోరులో మేము లేటుగా అభ్యర్థిని ప్రకటన చేయలేదు. దేశంలోని అన్ని బైఎలక్షన్స్‌కు ఒకేరోజు అభ్యర్థుల ప్రకటన చేశాం. మేము జూబ్లీహిల్స్‌లో చాలా ముందుకు పోతున్నాం. మాకు సర్వేలు అవసరం లేదు.. నేరుగా ఓటర్లను కలుస్తున్నాం. బూత్‌ల వారిగా టీంలు ఏర్పాటు చేశాం. వాటిని నమ్ముకున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.

అజారుద్దీన్‌కు మంత్రి పదవిపై కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ముస్లింల మీద ప్రేమతో అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారా..? ఆయనపై అంత ప్రేమ ఉంటే ఆయనకే టికెట్ ఇస్తారు కదా. ఆయన టికెట్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మేము ఏం చెప్పామో అది చేస్తున్నాం. ప్రజలకు అది చేస్తా.. ఇది చేస్తామని హామీ ఇవ్వలేదు.

మాపైన నమ్మకం తో ప్రజలు ఓటు వేశారు. మేము నరేంద్రమోదీ నాయకత్వంలో ఎన్ని పథకాలు ఇవ్వాలో అన్నీ ఇచ్చాం. డీపీఆర్ ఇవ్వనే లేదు..ఎల్ అండ్ తో అగ్రిమెంట్ కాలేదు.. మాకు రీవైజ్ డీపీఆర్ రావాల్సి ఉంది.. మారిన పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ డీపీఆర్ తయారు చేయలని కిషన్ రెడ్డి అన్నారు.