Telangana Rains : తెలంగాణలో నేడు భారీ వర్షాలు.. హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు.. హెచ్చరికలు జారీ..
Telangana Rains : తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. బుధవారం సైతం హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
- Harish Thanniru
- Updated on- July 29, 2026 / 06:59 AM IST
Telangana Rains
- తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు
- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో నేడు దంచికొట్టనున్న వానలు
- పది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
Telangana Rains : తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. బుధవారం సైతం హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో మొత్తం పది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
Also Read : CM Revanth Reddy : విద్యార్థులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కీలక ప్రకటన!
ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం నాటికి దక్షిణ ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ – వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రుతుపవన ద్రోణి ఒకటి ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించినట్లు పేర్కొంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఇవాళ భారీ వర్షాలతోపాటు.. పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిస్తాయని అంచనా వేసింది. గురు, శుక్రవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఇవాళ (బుధవారం) అదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యేఅ వకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఇదిలాఉంటే.. మంగళవారం ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. రాష్ట్రంలో అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ లో 5.8 సెం.మీ వర్షం కురిసింది.
వర్షాలతోపాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. చెట్ల కింద వేచి ఉండొద్దని, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఒకవేళ అత్యవసరమై బయటకు వస్తే తగిన రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షాల నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు.
