Vakiti Srihari: తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో విషాదం.. విధుల్లోనే నవీన్ మిట్టల్ పీఎస్ రాజు మృతి
Vakiti Srihari CPR: తెలంగాణ శాసనసభ ఆవరణలో విధుల్లో ఉన్న ఉద్యోగి ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోయారు. మంత్రి వాకిటి శ్రీహరి వెంటనే స్పందించి సీపీఆర్ అందించారు
Telangana Assembly Vakiti Srihari CPR ot Naveen Mittals Ps Raju Dies
- అసెంబ్లీ ఆవరణలో ఒక్కసారిగా కుప్పకూలిన రాజు
- అసెంబ్లీ ప్రాంగణంలో రాజు ఆకస్మిక మృతి
- రాజుకు సీపీఆర్ చేసిన మంత్రి వాకిటి శ్రీహరి
Vakiti Srihari CPR : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలతో సభలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇదే సమయంలో అసెంబ్లీ ప్రాంగణంలో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన అధికారులను, ప్రజాప్రతినిధులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ వద్ద పర్సనల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న రాజు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంగళవారం (Telangana Assembly) విధులకు హాజరయ్యారు. ఈ క్రమంలో అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. పరిస్థితిని గమనించిన సిబ్బంది వెంటనే స్పందించి అధికారులకు సమాచారం అందించారు.
Read Also : Apple Mega Event : సెప్టెంబర్ 9న ఆపిల్ నుంచి భారీ సర్ప్రైజ్లు! ఐఫోన్18 ప్రో నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ వరకు
మంత్రి వాకిటి సీపీఆర్ చేసినా..
అదే సమయంలో అక్కడ ఉన్న మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) వెంటనే రాజు వద్దకు చేరుకున్నారు. ఆయనకు సీపీఆర్ చేస్తూ ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజును అంబులెన్స్‌లో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రికి చేరుకునేలోపే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
అందిన సమాచారం ప్రకారం.. రాజు ఆకస్మిక గుండె సంబంధిత సమస్యకు గురికావడంతో ఈ విషాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. విధుల్లో ఉండగానే రాజు ప్రాణాలు కోల్పోవడంతో అసెంబ్లీ ప్రాంగణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సచివాలయ, అసెంబ్లీ సిబ్బంది రాజు మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
