Rain Alert: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజులలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు(Rain Alert) కురిసే అవకాశం ఉంది
- V Santhosh Kumar
- Published on- August 2, 2026 / 06:25 AM IST
Meteorological Department warning Rain forecast for Andhra Pradesh and Telangana over the next 48 hours
- రానున్న రెండు రోజులు భారీ వర్షాలు
- పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
- తీరప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజులలో వాతావరణం పూర్తిగా మారనుంది. భారత వాతావరణ శాఖ (IMD) సమాచారం ప్రకారం నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే సంకేతాలు ఉన్నందున, ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Amarnath Yatra: అమర్‌నాథ్ భక్తులకు గుడ్ న్యూస్.. మళ్ళీ మొదలైన దర్శనాలు.. ఈసారి ఆ మార్గంలో మాత్రమే
తెలంగాణ జిల్లాలకు అలర్ట్ – ఈదురుగాలుల హెచ్చరిక:
తెలంగాణలో రాబోయే రెండు రోజుల్లో గంటకు 30-40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ఐఎండీ ఎల్లో(Rain Alert) అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, జనగామ, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. వర్షం కురిసే సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున బహిరంగ ప్రదేశాల్లో లేదా చెట్ల కింద నిలబడకూడదని అధికారులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితి – తీరప్రాంత హెచ్చరికలు:
ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) అందించిన వివరాల ప్రకారం, ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు జల్లులు కురుస్తాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. సముద్రంలో గాలుల వేగం పెరిగే అవకాశం ఉన్నందున తీరప్రాంత వాసులు, మత్స్యకారులు వేటకు వెళ్లే సమయంలో జాగ్రత్త వహించాలని సూచించారు.
