ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఎంతో మందిని కబళించి వేస్తోంది. దీంతో చాలా మంది ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు..ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చాలా మంది బయటకు వెళ్లడం లేదు. ఈ వైరస్ ఎఫెక్ట్ పెళ్లి వేడుకలపై పడింది. ఈ నెలలో చాలా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. కానీ..ఈ వివాహ వేడుకలకు బంధువులు, మిత్రులు చాలా మంది దూరంగా ఉంటున్నారు. దీంతో వేడుకలు వెలవెలబోతున్నాయి.
అయితే..కొంతమంది ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. ఇలాగే..మెట్‌పల్లిలో ఓ పెళ్లి జరుగుతోంది. అయితే..తమ వివాహానికి హాజరయ్యే వారు మాస్క్‌లు ధరించి రావాలని వరుడు కండీషన్ పెట్టాడు. ఈ ఘటన మెట్ పల్లిలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన బెజ్జారపు ప్రవీణ్ – లక్ష్మీకి పెళ్లి సంబంధం కుదిరింది. 2020, మార్చి 20వ తేదీ శుక్రవారం వివాహం కుదిరింది. కరోనా వైరస్ విస్తృతమౌతున్న తరుణంలో…వైద్యుల సూచనలు తీసుకున్నాడు ప్రవీణ్.
తమ పెళ్లికి మాస్క్‌లతో రండి అంటూ పెళ్లిపత్రికతో పాటు మాస్క్‌లు పంపిణీ చేశాడు. 20వ తేదీన స్థానికంగా ఉన్న లిమ్రా ఫంక్షన్ హాల్‌లో ఈ వివాహం జరిగింది. వధూవరులతో పాటు..పూజారీ..బంధువు మిత్రులు..ఇలా ప్రతొక్కరూ..మాస్క్‌లు ధరించారు. మాస్క్‌లతోనే పెళ్లి వేడుకలకు సంబంధించి కార్యక్రమాలన్నింటినీ నిర్వహించడం విశేషం.
Read More : అయ్యో కరోనా ఎంత పని చేసింది..జనరల్ బజార్ వెలవెల