Microsoft: పోలీసులకు అండగా మైక్రోసాఫ్ట్.. UV బాక్సులు విరాళం

కోవిడ్ సమయంలోనూ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నట్లు కనిపించినా కూడా.. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా వారు చేస్తున్న సేవలు మాత్రం గొప్పవే.

UV disinfection: కోవిడ్ సమయంలోనూ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నట్లు కనిపించినా కూడా.. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా వారు చేస్తున్న సేవలు మాత్రం గొప్పవే. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న సమయంలో రోడ్లపై విధులలో కరోనా బారినపడుతామనే భయం లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. అటువంటి పోలీసులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది మైక్రోసాఫ్ట్ సంస్థ.

కరోనాపై పొరాటంలో హైదరాబాద్‌ పోలీసులు చేస్తున్న పోరుకు అండగా.. మైక్రోసాఫ్ట్‌ తన వంతుగా 135 అల్ట్రావయలెట్‌(UV) బాక్సులను విరాళంగా అందజేసింది. కీలక డాక్యుమెంట్లను శానిటైజ్‌ చేయడానికి ఇవి ఉపయోగించవచ్చు. దీని వల్ల బ్యాక్టీరియా క్రిములు, వైరస్‌ వ్యాప్తి కాకుండా అరికట్టవచ్చు.

మైక్రోసాఫ్ట్‌ ఇండియా (ఆర్‌ అండ్‌ డీ) ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ 135 యూవీ బాక్సులను హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజని కుమార్‌కు అందజేశారు. వీటిని నగరంలోని పోలీస్‌ స్టేషన్లకు ఇవ్వనున్నారు.

ట్రెండింగ్ వార్తలు