Adluri Laxman Kumar: మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్‌పై సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా, అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
“నేను పక్కన ఉంటే వివేక్ అక్కడి నుంచి లేచి వెళ్లిపోతున్నారు. పొన్నం ప్రభాకర్‌లా నేను అహంకారంగా మాట్లాడటం రాదు. నా వద్ద డబ్బులు లేవు. పొన్నం తప్పు తెలుసుకుంటారనుకున్నాను. నేను కాంగ్రెస్ జెండాని నమ్ముకున్న వాడిని. మంత్రిగా మూడు నెలల పొగ్రెస్ చూసుకోండి.
Also Read: 8th Pay Commission: గుడ్‌న్యూస్.. ఆలోపు భారీగా జీతాల పెంపు.. ఎంతెంత? ఎవరెవరికి ప్రయోజనం?
నేను మంత్రిని కావడం, మా సామాజిక వర్గంలో పుట్టడమే తప్పా. పొన్నం మారకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి. నేను త్వరలో సోనియా, రాహుల్, ఖర్గే, మీనాక్షిని కలుస్తాను” అని తెలిపారు.
ఈ పరిణామాలతో, సీఎం రేవంత్ రెడ్డి చేసిన సూచనలతో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్‌తో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఫోనులో మాట్లాడారు. ఇద్దరు మంత్రులు సమన్వయంతో కలిసి పని చేసుకోవాలని, ఒకరికొకరు సహకరించుకోవాలని అన్నారు. ప్రస్తుతం అడ్లూరి అదిలాబాద్ పర్యటనలో ఉన్నారు. హైదరాబాద్‌కు రాగానే కలుస్తానని చెప్పారు.