Bandi Sanjay : ఎల్ఆర్ఎస్ పేరుతో రూ.50 వేల కోట్ల దోపిడీకి స్కెచ్.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay : కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఎల్ఆర్ఎస్ పేరుతో రూ.50వేల కోట్ల దోపిడికి స్కెచ్ వేసిందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.

Bandi Sanjay : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. లేఅవుట్ క్రమబద్దీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) పేరుతో రూ.50 వేల కోట్ల దోపిడీకి స్కెచ్ వేశారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని డబ్బులు వసూలు చేస్తారా? అంటూ మండిపడ్డారు. పెద్దపల్లి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన దమ్ముంటే కేంద్ర బడ్జెట్ మీద బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు.

Read Also : PM Kisan : పీఎం కిసాన్ రైతులకు అలర్ట్.. ఈ 24వ తేదీన ఖాతాల్లో రూ. 2వేలు పడవు.. వెంటనే ఈ 3 పనులు చేయండి!

మీకు చేతనైతే బీసీ రిజర్వేషన్లపై టెన్ జనపథ్ ఎదుట ధర్నా చేయలన్నారు. కాంగ్రెస్ నమ్మక ద్రోహానికి, బీజేపీ పోరాటాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా పేర్కొన్నారు. బర్త్, డెత్ రెగ్యులరైజేషన్ స్కీంలను కూడా ప్రవేశపెడతారేమో అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై బండి సంజయ్ నిప్పులు చెరిగారు. ఉచితంగా ఎల్‌ఆర్ఎస్ చేస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ వీడియోను బండి సంజయ్ విడుదల చేశారు.

ఎల్ఆర్ఎస్ పేరిట డబ్బులు ఎవరూ చెల్లించొద్దని సూచించారు. అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజలకు ఉచితంగా భూములను క్రమబద్దీకరిస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు డబ్బులు ఎందుకు దండుకోవాలని చూస్తున్నారో చెప్పాలని మండిపడ్డారు.

Read Also : Samsung Galaxy A06 5G : రూ. 10వేల ధరలో కొత్త శాంసంగ్ ఫోన్.. ఫీచర్లు మాత్రం కేక.. ఇంత తక్కువకే వస్తుంటే కొనాల్సిందే..!

గత ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క మాట్లాడిన వీడియోలను కూడా బండి సంజయ్ మీడియాకు విడుదల చేశారు. ఇచ్చిన మాట ప్రకారం.. ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాల్సిందేనని అన్నారు.