Harish Rao : తొమ్మిదేళ్ల తెలంగాణలో కరువు లేదు కర్ఫ్యూ లేదు.. ప్రతి ఇంటికి నీళ్లందిస్తున్న కేసీఆర్ : మంత్రి హరీష్ రావు

కేసీఆర్ రాకుంటే రియల్ ఎస్టేట్ ఢమాల్ అవుతుందన్నారు. తమది అద్భుతమైన మేనిఫెస్టో ప్రతి ఇంటికి, ప్రతి గుండెకు తీసుకువెళ్ళాలన్నారు.

Minister Harish Rao (6)

Harish Rao – Praja Ashirwada Sabha : తొమ్మిదేళ్ల తెలంగాణలో కరువు లేదు కర్ఫ్యూ లేదని మంత్రి హరీష్ రావు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తున్నాడని పేర్కొన్నారు. కేసీఆర్ చేతిలో తెలంగాణ ఉంటే ప్రశాంతంగా ఉంటుందన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికి మోడల్ గా మారిందని తెలిపారు. ‘నాడు బెంగాల్ ఆచరిస్తే దేశం అనుసరించేది.. నేడు తెలంగాణ మోడల్ అయ్యింది’ అని అన్నారు. గురువారం మల్కాజ్ గిరి ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు.

కర్ణాటకలో కరెంట్ కోతలు, రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. కర్ణాటకలో కుర్చీల కొట్లాట జరుగుతోందని ఎద్దేవా చేశారు. ఒకర్ని దించాలే, మరొకరిని ఎక్కించాలని అన్నారు. రాహుల్ గాంధీ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివి పోతున్నాడని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా అని అన్నారు. ‘కాంగ్రెస్ పాలనలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అంటే, నేడు పోదాం పద సర్కారు దవాఖాన అని’ అంటున్నారని తెలిపారు.

Tealangana BJP : తెలంగాణ బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల.. 35 మందికి చోటు

ఇన్వర్టర్ లేదు, కన్వర్టర్ లేదని కేసీఆర్ ఓట్ల కోసం చెప్పలేదన్నారు. ప్రతి పేదింటి ఆడ బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ద్వారా లక్ష రూపాయలు ఇచ్చారని వెల్లడించారు. ఇక్కడ ఎన్నికలు మంచి మనసున్న మనిషికి మాటలు, ముఠాల మనిషికి మధ్య పోటీ అని అన్నారు. మైనంపల్లి స్వార్థం కోసం పార్టీ మారాడని.. మెదక్, మల్కాజగిరి రెండు చోట్ల ఓడటం ఖాయమని తేల్చి చెప్పారు. కేసీఆర్ టికెట్లు ఇస్తే మంచోడు, లేకుంటే చెడ్డొడా అని ప్రశ్నించారు. మర్రి రాజశేఖర్ రెడ్డి ఎంపీగా ఓడినా ప్రజాసేవ మరచిపోలేదన్నారు.

మల్కాజ్ గిరి ప్రజలకు సీఎం 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కట్టిస్తున్నారని పేర్కొన్నారు. అందులోనే 250 పడకల మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి కూడా ఉంటుందని చెప్పారు. అల్వాల్ లో కార్పొరేట్ వైద్య సేవలు అందనున్నాయని వెల్లడించారు. కేసీఆర్ కు ప్రేమ గుణం ఉంది అంతే గానీ పగ గుణం లేదన్నారు. ’28 రోజులు కష్టపడి రాజశేఖర్ రెడ్డిని గెలిపించండి.. నేను దత్తత తీసుకొని అభివృద్ధికి బాధ్యత తీసుకుంటా’ అని అన్నారు.

Minister KTR : ఇప్పటి వరకు ఓటమి ఎరుగని కేసీఆర్ .. మళ్లీ ఆయనేదే విజయం : కేటీఆర్

ఏ సర్వే చూసినా 75 నుండి 80 సీట్లతో బీఆర్ఎస్ గెలుపు ఖాయం అని అన్నారు. కేసీఆర్ అంటే ఏబుల్ లీడర్, స్టేబుల్ గవర్నమెంట్ ఉందని కొనియాడారు. రాష్ట్రం కేసీఆర్ చేతుల్లో ఉండాలా, గుండాలు, దొంగలు, ముఠాల చేతుల్లో ఉండాలా అని అన్నారు. సన్నీ డియోల్, రజినీ కాంత్ హైదరాబాద్ కు వచ్చి ఇక్కడి అభివృద్ధి మెచ్చుకున్నారని తెలిపారు. పక్క రాష్ట్రంలో ఉన్న రజినీలకు అర్థం అయ్యింది.. కానీ కాంగ్రెస్ గజినీలకు అర్థం కావడం లేదన్నారు.

కేసీఆర్ రాకుంటే రియల్ ఎస్టేట్ ఢమాల్ అవుతుందన్నారు. తమది అద్భుతమైన మేనిఫెస్టో ప్రతి ఇంటికి, ప్రతి గుండెకు తీసుకువెళ్ళాలన్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్లందరూ తన బిడ్డలు అని భావించే గొప్ప నాయకులు కేసీఆర్ అని కొనియాడారు. మర్రి రాజశేఖర్ రెడ్డిని లక్ష మెజారిటీతో గెలిపించాలని కోరారు.