Minister Harish Rao: భూరాజేశ్వర ట్రస్టు..వాసవీ నిత్యాన్నదాన సత్రానికి నా నెల వేతనం విరాళంగా ఇస్తా : మంత్రి హరీశ్ రావు

శ్రీ స్వయం భూరాజేశ్వర ట్రస్టు వాసవీ నిత్యాన్నదాన సత్రాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఈ భూరాజేశ్వర ట్రస్టు వాసవీ నిత్యాన్నదాన సత్రానికి తన నెల వేతనాన్ని విరాళంగా అందిస్తాను అని ప్రకటించారు.

Minister Harish Rao Donated Monthly Salary Bhurajeshwara Trust

Minister Harish Rao: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని పందిళ్ల గ్రామంలో మంగళవారం (జూన్ 7,2022)శ్రీ స్వయం భూరాజేశ్వర ట్రస్టు వాసవీ నిత్యాన్నదాన సత్రాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఈ భూరాజేశ్వర ట్రస్టు వాసవీ నిత్యాన్నదాన సత్రానికి తన నెల వేతనాన్ని విరాళంగా అందిస్తాను అని ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి పొట్లపల్లి శ్రీ స్వయం భూ రాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి ముర్రంశెట్టి రాములు తండ్రి పరితపించే వారని..ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి మంచి పేరు గడించారని గుర్తు చేసుకున్నారు.

జూన్ 12న గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్‌తో గోదావరి జలాలు హుస్నాబాద్ నియోజక వర్గాన్ని ముద్దాడనున్నాయని మంత్రి అన్నారు. గౌరవెల్లి ట్రయల్ రన్ పూర్తయితే.. హుస్నాబాద్ ప్రాంతమంతా గోదావరి జలాలతో సస్య శ్యామలం అవుతుందని మంత్రి పేర్కొన్నారు.

హుస్నాబాద్‌లో రూ.10 కోట్లతో 50 పడకల మాతా, శిశు సంక్షేమ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తామని..నియోజకవర్గంలోని అన్ని తండాలకు త్వరలోనే రోడ్లు మంజూరు చేస్తామని హామీనిచ్చారు.