Telangana Budget: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ బడ్జెట్..!

మరి కాసేపట్లో.. రాబోయే ఆర్థిక సంవత్సర తెలంగాణ బడ్జెట్ ను.. మంత్రి హరీష్ రావ్.. శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా.. జూబ్లీహిల్స్ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆయన పూజలు చేశారు.

Harish Rao

Telangana Budget: మరి కాసేపట్లో.. రాబోయే ఆర్థిక సంవత్సర తెలంగాణ బడ్జెట్ ను.. మంత్రి హరీష్ రావ్.. శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా.. జూబ్లీహిల్స్ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆయన పూజలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో తాను మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నట్టు హరీష్ చెప్పారు.

శాసనసభలో 11.30 గంటలకు తాను.. శాసనమండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి.. పద్దులు ప్రవేశపెడతారని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే.. ప్రజలకు తాము ఇచ్చిన హామీలు తీర్చే విధంగానే బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని మంత్రి హరీష్ చెప్పారు. మానవీయ కోణంలో ఈ సారి బడ్జెట్ రూపొందించామన్నారు.

Read More: Telangana Budget: నేడే తెలంగాణ బడ్జెట్

ఇక.. ఈ సారి బడ్జెట్ సమావేశాలకు అధికార విపక్షాలు అస్త్ర శస్త్రాలతో సిద్ధమయ్యాయి. గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలను ప్రారంభిస్తుండడం.. రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ విషయంపై.. ప్రభుత్వాన్ని విపక్షాలు నిలదీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు.. తమ విధానాన్ని సమర్థించుకుంటున్న అధికార టీఆర్ఎస్.. విపక్షాలకు దీటుగా బదులు చెప్పేందుకు సిద్ధమయ్యాయి.

ఈ పరిస్థితుల్లో.. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఏ రంగాలకు ఎలాంటి బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి.. వాటికి విపక్షాల స్పందన ఎలా ఉండనుందన్నది.. ఆసక్తికరంగా మారింది.
Read More: Telangana Budget : తెలంగాణ బడ్జెట్ రూ. 2.70 లక్షల కోట్లు ? అంచనాలు