Telangana Budget : తెలంగాణ బడ్జెట్ రూ. 2.70 లక్షల కోట్లు ? అంచనాలు

తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ భారీ బడ్జెట్‌కు రంగం సిద్ధం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి 2.30 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈసారి...

Telangana Budget : తెలంగాణ బడ్జెట్ రూ. 2.70 లక్షల కోట్లు ? అంచనాలు

Telangana Budget

Telangana State Budget : తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ భారీ బడ్జెట్‌కు రంగం సిద్ధం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి 2.30 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈసారి 2.65 లక్షల కోట్ల నుంచి 2.70 లక్షల కోట్ల మేర బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా పరిస్థితుల నుంచి బయటపడి రాష్ట్ర వృద్ధిరేటు బాగా పెరగడంతో గత ఏడాది కంటే 35 వేల కోట్ల మేర బడ్జెట్‌ పరిమాణాన్ని పెంచనుంది.

Read More : TS Assembly : నేడే బడ్జెట్, దళిత బంధుకు నిధులు ఎన్ని ? నిరుద్యోగ భృతి ప్రకటిస్తారా?

భారీగా ఉద్యోగాల భర్తీకి అవసరమైన కార్యాచరణను ప్రభుత్వం స్పష్టం చేయనుంది. వచ్చే ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నందున ఇదే పూర్తిస్థాయి బడ్జెట్‌ కావడంతో ఎన్నికల బడ్జెట్‌గానే భావించి కసరత్తు చేసినట్లు సమాచారం. సంక్షేమం, వ్యవసాయానికి పెద్దపీట దక్కనుంది. దళితబంధుకు 20 వేల కోట్లు, రైతుబంధుకు 15 వేల కోట్ల మేర కేటాయించనున్నట్లు తెలిసింది.

Read More : Telangana Budget: నేడే తెలంగాణ బడ్జెట్

ఆసరాకు గతం కంటే 3 వేల కోట్లు పెరిగినట్లు సమాచారం. పథకాల వ్యయం 1.5 లక్షల కోట్లను దాటనుండగా నిర్వహణ వ్యయం 1.10 లక్షల కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. వెనుకబడిన తరగతుల ఫెడరేషన్‌లకు ప్రత్యేక కేటాయింపులపై ప్రభుత్వం ఈసారి దృష్టి సారించింది. జీఎస్టీ, అమ్మకం పన్ను, రిజిస్ట్రేషన్ల రాబడి పైనా ప్రభుత్వం విశ్వాసంతో ఉంది. రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధిరేటు ఈసారి 19.10 శాతంగా నమోదు కావడంతో ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో రుణాలను పెంచుకోనుంది. కేంద్ర పన్నుల వాటా, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనాల కంటే తగ్గాయి.

Read More : Telangana : టుడే తెలంగాణ కేబినెట్ భేటీ..2022-23 బడ్జెట్‌‌కు ఆమోదం

సోమవారం ఉదయం 11.30 గంటలకు గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.. మండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను సమర్పిస్తారు. ప్రస్తుత శాసనసభ గడువు వచ్చే ఏడాది డిసెంబర్ వరకు ఉండగా.. ప్రభుత్వానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ ఇదే కానుంది. కోవిడ్ నిబంధనల మేరకు సమావేశాలకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత సభ ప్రారంభమైన ఫస్ట్ డే బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. అటు గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తుండటాన్ని బీజేపీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తప్పుబట్టారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగానికి కట్టుబడి ఉందన్నారు మంత్రి హరీశ్ రావు. కొత్త సెషన్ అయితేనే గవర్నర్‌ను పిలవాలని రాజ్యాంగం తెలిపిందన్నారు.