TS Assembly : నేడే బడ్జెట్, దళిత బంధుకు నిధులు ఎన్ని ? నిరుద్యోగ భృతి ప్రకటిస్తారా?

ఉదయం 11.30 గంటలకు గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శాసనసభలో...

TS Assembly : నేడే బడ్జెట్, దళిత బంధుకు నిధులు ఎన్ని ? నిరుద్యోగ భృతి ప్రకటిస్తారా?

Harish Rao

Telangana Assembly Budget : ఇప్పుడు అందరి చూపు తెలంగాణ బడ్జెట్ పై నెలకొంది. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. సోమవారం ఉదయం 11.30 గంటలకు గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.. మండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను సమర్పిస్తారు. ప్రస్తుత శాసనసభ గడువు వచ్చే ఏడాది డిసెంబర్ వరకు ఉండగా.. ప్రభుత్వానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ ఇదే కానుంది. కోవిడ్ నిబంధనల మేరకు సమావేశాలకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత సభ ప్రారంభమైన ఫస్ట్ డే బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి..

Read More : Telangana Budget : రేపటి నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.30 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈసారి రూ. 2.65 లక్షల కోట్ల నుంచి రూ. 2.70 లక్షల కోట్ల మేర బడ్జెట్ ను ప్రవేశపెడుతారని సమాచారం. కరోనా నుంచి కోలుకున్న తర్వాత రాష్ట్ర వృద్ధి రేటు బాగా పెరిగింది. దీంతో ఏ రంగానికి ఎంత నిధులు కేటాయిస్తారనేది ఉత్కంఠ నెలకొంది. అందులో ప్రధానంగా దళిత బంధుకు రూ. 20 వేల కట్లు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ బడ్జెట్ లో నిరుద్యోగ భృతిపై ఎలాంటి ప్రకటన వెలువడుతుందనే ఉత్కంఠ నెలకొంది. గతంలో ఎప్పుడూ లేనంత వాడివేడిగా ఈ సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవైపు ముఖ్యమంత్రి కేసీఆర్.. బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న సమయంలో అసెంబ్లీ సమావేశాలు ఆసక్తిని రేపుతున్నాయి. సభ వేదికగా కమలానికి కేసీఆర్ కౌంటర్లు వేసే అవకాశాలున్నాయి.

Read More : Minister KTR : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఎలాంటి నిధులు ప్రకటించలేదు : మంత్రి కేటీఆర్‌

అసెంబ్లీ వేదికగా సర్కార్ సాధించిన విజయాలను, ప్రభుత్వ ప్రాధాన్యతలను, ప్రజా సంక్షేమ పథకాలను వివరించాలని మంత్రులకు సూచించారు. విపక్ష సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానంతో సిద్ధంగా ఉండాలని సూచించారు ముఖ్యమంత్రి. అయితే మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్య కుట్ర అసెంబ్లీలో హీట్ పుట్టించనుంది. అటు గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తుండటాన్ని బీజేపీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తప్పుబట్టారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగానికి కట్టుబడి ఉందన్నారు మంత్రి హరీశ్ రావు. కొత్త సెషన్ అయితేనే గవర్నర్‌ను పిలవాలని రాజ్యాంగం తెలిపిందన్నారు.