Telangana Budget : రేపటి నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. స‌మావేశాల సంద‌ర్భంగా అనుస‌రించాల్సిన అంశాల‌పై ఇప్పటికే స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రొటెం చైర్మన్ అమీనుల్ జాఫ్రీలు స‌మీక్ష

Telangana Budget : రేపటి నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

Telangana Assembly

Telangana Assembly Budget Meeting : తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. స‌మావేశాల సంద‌ర్భంగా అనుస‌రించాల్సిన అంశాల‌పై ఇప్పటికే స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రొటెం చైర్మన్ అమీనుల్ జాఫ్రీలు స‌మీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. కోవిడ్ వ్యాప్తి అదుపులో ఉన్నా.. త‌గిన జాగ్రత్తలు తీసుకుంటూ ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అధికారులు స‌భ్యులు ఎలాంటి ప్రశ్నలు అడిగినా స‌మాచారం అందించేందుకు రెడీగా ఉండాల‌ని సూచించారు.గ‌తంలో జ‌రిగిన స‌మావేశాల‌కు సంబంధించిన ప్రశ్నల‌ను వెంట‌నే స‌భ్యుల‌కు అందేలా చూడాల‌ని అధికారుల‌ను స్పీక‌ర్ ఆదేశించారు.

Read More : Telangana : టుడే తెలంగాణ కేబినెట్ భేటీ..2022-23 బడ్జెట్‌‌కు ఆమోదం

శాస‌న‌స‌భా స‌మావేశాల నిర్వహ‌ణ‌లో అధికారులు అప్రమ‌త్తంగా వ్యవ‌హ‌రించాల‌ని స్పీక‌ర్ ఆదేశించారు. అసెంబ్లీ స‌మావేశాల నిర్వహ‌ణ‌లో దేశంలోని ఇత‌ర రాష్ట్రాల‌కు తెలంగాణా ఆద‌ర్శంగా నిలుస్తోంద‌న్నారు. స‌భ స‌జావుగా నిర్వహించేందుకు అసెంబ్లీ ప‌రిస‌ర ప్రాంతాల్లో భ‌ద్రతా ప‌ర‌మైన చ‌ర్యలు క‌ట్టుదిట్టంగా చేప‌ట్టాల‌ని పోలీసు అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ స‌మావేశాల నేప‌థ్యంలో కోవిడ్ ప‌రీక్షా కేంద్రాన్ని అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో ఏర్పాటు చేయాల‌ని.. అనుమానం ఉన్న వారికి ప‌రీక్షలు నిర్వహించాల‌ని సూచించారు. 2022, మార్చి 07వ తేదీ సోమవారం నుంచి మొద‌ల‌య్యే ఉభ‌య స‌భ‌లు.. రెండు వారాల పాటు జ‌రిగే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొద‌టి రోజు బ‌డ్జెట్ అనంత‌రం జ‌రిగే బీఏసీ స‌మావేశంలో అసెంబ్లీ ప‌నిదినాల‌పై స్పష్టత రానుంది.