Komatireddy Venkat Reddy : ఎస్ఎల్ బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రెస్క్యూ బృందాలన్నీ ఘటన స్థలానికి చేరుకున్నాయని ఆయన తెలిపారు. నాలుగు గంటలుగా తీవ్రంగా శ్రమిస్తున్నాయన్నారు.
కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. కార్మికులు ఎక్కడో ఒక చోట ఉండే ఉంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అధికారులందరితో చర్చిస్తున్నామన్నారు. నీళ్లు, బురద ఉండడంతోనే రెస్క్యూ ఆపరేషన్ కు అంతరాయం ఏర్పడిందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.
Also Read : గెలిచి తీరాల్సిందేనని కాంగ్రెస్ ప్రయత్నాలు.. గట్టి పోటీ ఇస్తున్న ప్రత్యర్థులు వీరే..
”NDRF బృందం ఇలాంటివి ఎన్నో చూసి ఉంటుంది. మొన్న ఒక కార్మికుడు ఫోన్ లో తన భార్యతో మాట్లాడారు. ఫోన్ లొకేషన్ టన్నెల్ దగ్గరే చూపిస్తోంది. నేనే ఫోన్ చేశారు. రింగ్ అయింది. ప్రస్తుతం ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. రేపటి వరకు నీరు తగ్గితే ఏం చెయ్యాలో బృందాల ప్రతినిదులు నిర్ణయిస్తారు. అంబులెన్స్ లు కూడా సిద్ధంగా ఉంచాం. ఉత్తరాఖండ్ తరహాలో ఇక్కడ కూడా సురక్షితంగా బయటకు వస్తారని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.
ఆ 8మంది సురక్షితంగా ఉంటారని మాకైతే నమ్మకం ఉంది. సిల్వర్ డాగ్స్ తో కూడా ప్రయత్నాలను కొనసాగిస్తున్నాం. వారిని రక్షించేందుకు ప్రపంచంలో ఏ బృందం ఉన్నా ప్రత్యేక విమానాలు పెట్టి రప్పిస్తాం. పేరుకుపోయిన బురద, నీరు కారణంగా సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. 8 మందిలో ఒకరి సెల్ ఫోన్ పని చేసింది. ఇప్పుడు స్విచ్చాఫ్ వస్తోంది. 8 మంది సెల్ ఫోన్ల సిగ్నల్స్ కూడా ప్రయత్నిస్తున్నాం” అని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.
Also Read : ఎస్ఎల్ బీసీ టన్నెల్ ప్రమాదంపై అనేక అనుమానాలు ఉన్నాయి- మాజీమంత్రి హరీశ్ రావు
”SLBC టన్నెల్ వద్ద సహాయక చర్యలను పర్యవేక్షించాను. ఎంత కష్టమైనా టన్నెల్ లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ఉన్న అన్ని మార్గాలను ప్రయత్నించాలని అధికారులను ఆదేశించాను. దేశవ్యాప్తంగా జరిగిన టన్నెల్ ప్రమాద సంఘటనల్లో చిక్కుకున్న బాధితులను కాపాడిన నిపుణుల అనుభవాలను తీసుకొని వారిని సురక్షితంగా కాపాడే ప్రయత్నం చేస్తున్నాం” అని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.