యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మారుస్తాం.. త్వరలోనే జీవో ఇస్తాం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాళేశ్వరం కట్టిన చీఫ్ డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డ ఎందుకు పోలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.

Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి పేరును మారుస్తామని చెప్పారు. యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మారుస్తూ త్వరలోనే జీవో ఇస్తామని పేర్కొన్నారు. మీడియాతో చిట్ చాట్ లో కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం కేటీఆర్ పై విమర్శలు చేశారు. కేటీఆర్ తండ్రి చాటు కొడుకు.. నేను ఉద్యమాలు చేసి వచ్చాను.. మేం జీరో బిల్ ఇచ్చినట్లు కేటీఆర్ కు జీరో నాలెడ్జ్ అంటూ ఎద్దేవా చేశారు. నాలెడ్జ్ లేని కేటీఆర్ గురించి మాట్లాడటం వేస్ట్ అంటూ మంత్రి వ్యాఖ్యానించారు.

Also Read : టీడీపీ-జనసేన కూటమితో పొత్తు, పోటీ చేసే స్థానాలపై క్లారిటీ ఇవ్వనున్న బీజేపీ

ఫ్లోర్ లీడర్ ఇవ్వకపోతే హరీష్ కూడా బీజేపీలోకి వెళ్లిపోతాడు అంటూ మంత్రి వెంకటరెడ్డి అన్నారు. కాళేశ్వరం కట్టిన చీఫ్ డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డ ఎందుకు పోలేదు? కాళేశ్వరం పనికిరాదని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ప్రజలే కేసీఆర్ ను నామరూపాలు లేకుండా చేశారు. ఎంపీ అభ్యర్థులపై ఇంటర్నల్ సర్వే జరుగుతోంది. భువనగిరి నుంచి పోటీ చేయమని రాహుల్ గాంధీకి చెప్పానని కోమటిరెడ్డి తెలిపారు. భువనగిరి, ఖమ్మం, నల్గొండ మూడు పార్లమెంట్ స్థానాల్లో సౌత్ ఇండియాలో టాప్ మెజార్టీ కాంగ్రెస్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోదీ కంటే రాహుల్ ఎక్కువ మెజార్టీతో గెలుస్తారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

ట్రెండింగ్ వార్తలు