Komatireddy: సినిమాల్లో విలన్ల అరెస్ట్ క్లైమాక్స్ వరకు జరగదు, కేసీఆర్ కంటే ఆయనే ఎక్కువ సంపాదించారు- మంత్రి కోమటిరెడ్డి

కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఎకరం 50 లక్షలు ఉంటే.. ఆయన ఫామ్ హౌస్ లో ఎకరం 40 కోట్లు ఉంటుందన్నారు.

Komatireddy: చిట్ చాట్ లో మాజీ సీఎం కేసీఆర్ అరెస్ట్ అంశంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సెటైరికల్ గా స్పందించారు. సినిమాల్లో విలన్ల అరెస్ట్ క్లైమాక్స్ వరకు జరగదని అన్నారు. అరెస్ట్ చేయడం అంటే సినిమాల్లో విలన్లను ఫైనల్ లో అరెస్ట్ చేస్తారని సెటైరికల్ గా చెప్పారు. అరెస్ట్ అనేది మేము చెయ్యం.. పోలీసులు, న్యాయ వ్యవస్థలు చేస్తాయని వ్యాఖ్యానించారు. కేసీఆర్ చేసిన అవినీతి తెలిస్తే గుండె పగిలి చనిపోతారన్నారు.

SLBCపైనా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం నా మీద కోపం SLBC మీద చూపిందన్నారు. SLBC కూలిపోవాలని ఫామ్ హౌజ్ లో క్షుద్ర పూజలు చేసినట్లు ఉందన్నారు. 43 కిలోమీటర్లు SLBC టన్నెల్ ఓ అద్భుతం.. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం అసలు అద్భుతమే కాదని మంత్రి కోమటిరెడ్డి.

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జగదీశ్ రెడ్డిని ఇంటర్నేషనల్ లీడర్ గా అభివర్ణించారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎవరు కమీషన్లు ఇస్తే వాళ్ళ వెంట తిరిగేవారని అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఎకరం 50 లక్షలు ఉంటే.. జగదీష్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఎకరం 40 కోట్లు ఉంటుందన్నారు. 80 ఎకరాలతో కేసీఆర్ జేజమ్మ లెక్క జగదీష్ రెడ్డి ఫామ్ హౌస్ ఉందన్నారు. కేసీఆర్ కంటే ఎక్కువ జగదీష్ రెడ్డి సంపాదించారని ఆరోపించిన మంత్రి కోమటిరెడ్డి.. జగదీష్ రెడ్డి అవినీతిపై విచారణ చేపిస్తున్నామని తెలిపారు.

Also Read: సినీ కార్మికుల సమ్మె.. మొండి పట్టుదలకు పోతే మీరే నష్టపోతారు.. మంత్రి కోమటిరెడ్డి కీలక సూచనలు..