Eetala – Bjp
Eetala – BJP: తెలంగాణ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇచ్చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై మంత్రులు ఫైర్ అవుతున్నారు. సీఎం కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ పార్టీని విమర్శించడం సరికాదని చెప్తున్నారు. ఇదే క్రమంలో ఈటలకు అంతగా ప్రాధాన్యత ఇచ్చిన సీఎంపై విమర్శలు చేస్తున్న వైఖరిని మంత్రి కొప్పుల ప్రశ్నించారు.
ఈటల రాజేందర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా సీఎం పైన ఆరోపణలు చేస్తూ తప్పులను కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అవమానాలు ఎదుర్కొన్నారనడం కరెక్ట్ కాదు. అతనికి ఇచ్చిన గౌరవం సీఎం కేసీఆర్ ఎవరికీ ఇవ్వలేదు. ఇప్పటికే రెండు సార్లు కీలక బాధ్యతలు ఇచ్చి మంత్రి పదవితో గౌరవించారు.
అలాంటప్పుడు ఆత్మ గౌరవం ఎక్కడ భంగపడిందో స్పష్టత లేదు. స్వయంగా సీఎం అభినందించిన సందర్భాలు మరిచిపోయి ప్రగతి భవన్‌కి వెళ్తే అపాయింట్ దొరకడం లేదని చెప్తున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సీఎంను కలవడం కుదరలేదు కావొచ్చు. మంత్రి వర్గంలో క్యాబినెట్‌లో నిర్ణయాలను సమర్ధిస్తూనే, పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడమేంటి. మంత్రి వర్గ నిర్ణయాలు నచ్చకపోతే అక్కడే చెప్పొచ్చు.
అభిప్రాయాల మీద గౌరవం లేకపోతే రాజీనామా సమర్పించొచ్చు. అలాకాకుండా పార్టీని ఇబ్బందులకు గురి చేసే విధంగా మాట్లాడడం కరెక్ట్ అనిపించుకోదు. ఐదేళ్ల నుంచి పార్టీకి దూరంగా ఉన్నానని చెప్తున్నారు. ఆత్మగౌరవం ఉన్న మీరు ఎందుకు ఉండాల్సి వచ్చింది. కబ్జాల వ్యవహారం మాకెవరికి తెలియదనుకోవద్దు.
రైతు బంధుపై క్యాబినెట్‌లో మాట్లాడకుండా బయటకు వచ్చి ఎలా మాట్లాడతావ్. బెంజ్ కార్ల లో డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పినందుకు సంతోషం. మాటలతోనే కాకుండా చేతల్లో చూపించేది ఏమైనా ఉందా? 10 లక్షల 24 వేలు 2020లో ఈటల కుటుంబ సభ్యులు తీసుకున్నారు. SC, BC, దేవాలయ భూములు క్రమబద్ధీకరించారు. SC, BCల గురించి మాట్లాడుతున్నావ్ కదా భూములు రిటర్న్ చేసి మాట్లాడు. ఆత్మగౌరవ భవనాల నిర్మాణాల పట్ల శ్రద్ద ఎందుకు చూపలేదు.
ఆత్మగౌరవం కాదు మీది ఆత్మవంచన. మీది వామ పక్ష జాలం అయినా బీజేపీ ఎందుకు చేరతారో ప్రజలకి చెప్పాలి. బీజేపీలో చేరడం ఆత్మవంచనే. ఢిల్లీలో మూడు రోజులు ప్రయత్నం చేసినా అమిత్ షా అపాయింట్మెంట్ దొరకలేదు. నల్ల చట్టాలపై మీరు బీజేపీ నాయకులను అడిగారా.. మీరు ఏ ప్రాతిపదికపై బీజేపీలో చేరుతున్నారో చెప్పాలి.
బీజేపీలో చేరిది ఆస్తుల పరిరక్షణ కోసమా… మీ పరిరక్షణ కోసమా బీజేపీలో చేరేది. ప్రగతి భవన్ సాక్షిగా ప్రాజెక్టుల నిర్మాణం, సంక్షేమ పథకాలు జరిగాయి. ప్రజలు మాత్రం కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసం ఉంది. మీ ఆరోపణల్లో నిజం లేదనేది తేట తెల్లం అవుతుంది.
నీ భావజాలంతో నిలపడితే ప్రజలు మిమ్మల్ని గౌరవించే వారు. కాంగ్రెస్, బీజేపీ చుట్టూ తిరగడం తోనే మీ ఆత్మగౌరవం పోయింది. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలులో లేవు’ అని ఈటల బీజేపీ ఎంట్రీ అంశంపై ఫైర్ అయ్యారు.