Ktr Hot Comments On Eatala Rajender
Minister KTR : మాజీమంత్రి ఈటల రాజేందర్‌కు కేసీఆర్ తో ఐదేళ్లనుంచి గ్యాప్ ఉంటే మంత్రిగా ఎందుకు కొనసాగారని పురపాలక శాఖమంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఈటలకు ఎంత విలువ ఇచ్చిందో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన అన్నారు. ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్‌లో జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలని…ఈటెల రాజేందర్ చివరి వరకు పార్టీలో ఉండాలని నేనూ వ్యక్తిగతంగా ప్రయత్నం చేసాను అని కేటీఆర్ చెప్పారు.
ఈటల ఆత్మవంచన చేసుకుంటున్నారని…ఐదేళ్ల నుంచి ఈటెల రాజేందర్ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా మంత్రిగా కేసీఆర్ ఉంచారని చెప్పారు. ఈటెల రాజేందర్ పార్టీలోకి రాక ముందు కమలాపురం, హుజూరాబాద్ బలంగానే ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. హుజూరాబాద్ లో పోటీ వ్యక్తల మధ్య కాదని…పార్టీల మధ్యే అని ఆయన అన్నారు. ఈటల కేసీఆర్ ను కలవను అన్నతర్వాత నేను కూడా ఏమీ చేయలేనని కేటీఆర్ అన్నారు.
కేంద్రం రాష్ట్రానికి మొండి చేయి ఇస్తోందని…. జలజీవన్ మిషన్ కింద కేంద్రం అన్ని రాష్ట్రాలకు నిధులు ఇస్తోంది కానీ తెలంగాణకు ఇవ్వటం లేదని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ అన్ని రంగాల్లోనూ అభివృధ్ది చెందిందని, టీఆర్ఎస్ చేసిన అభివృధ్ది బేజేపీ ఖాతాలో ఎలావేసుకుంటారని కేటీఆర్ ప్రశ్నించారు.
జల వివాదాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ఎన్ని కేసులు వేసినా న్యాయబధ్దంగా మేమ గెలుస్తామని ఆయన అన్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ గురించి మాట్లాడుతూ….ఒక్కో వారంలో ఒక్కొక్కరు ఒక్కో వ్రతం చేస్తారని షర్నిల ప్రస్తుతం వ్రతాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.