Minister KTR in Workshop on Urban Development at MCHRD
Telangana : MCHRDలో పట్టణ ప్రగతి నిర్వహించిన వర్క్ షాప్ లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..పట్టణీకరణలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని అన్నారు. పారిశ్రామికవేత్తలు తెలంగాణను చూసి అబ్బురపడుతున్నారని పట్టణ ప్రగతి కోసం RRR సూత్రం అమలు చేస్తామని వెల్లడించారు. RRR అంటే ఏమిటి అనుకుంటున్నారా? RRR అంటే రెడ్యూజ్డ్, రీయూజ్, రీసైకిల్ అని వివరించారు మంత్రి కేటీఆర్.
తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాలకు కేంద్రం నుంచి 25 అవార్డులు వచ్చాయని..అభివృద్ది జరగటం వల్లే తెలంగాణ అవార్డులు గెలుచుకుందని అన్నారు. పనులు జరగకుంటే కేంద్రం అవార్డులు ఊరికే ఇస్తుందా? అని ప్రశ్నించారు. రాజకీయంగా విమర్శలు ఎన్నైనా చేయొచ్చు..కానీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని గుర్తించి తీరాలని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి గర్వపడేలా నాయకులు ఉండాలి తప్ప విమర్శలు చేయటానికి ఇష్టానురీతిగా మాట్లాడొద్దని వాస్తవాలనుగుర్తించి వ్యాఖ్యలు చేయాలని సూచించారు. దేశానికే తెలంగాణ రోల్ మోడల్ గా ఉందని అన్నారు.