Minister KTR: ప్రముఖ ఫ్రెంచ్ గౌర్మెట్ ఫ్లేవరింగ్స్ కంపెనీ, జార్జెస్ మోనిన్ SAS – MONIN భారతదేశంలో తన మొదటి తయారీ యూనిట్‌కు శంకుస్థాపన చేసింది. హైదరాబాద్ నగర శివార్లలోని సంగారెడ్డి జిల్లాలోని గుంటపల్లి గ్రామంలో 40 ఎకరాల స్థలంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ యూనిట్ మోనిన్ కు తమ భారతదేశ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలువనుందని ఆ కంపెనీ పేర్కొంది.
Delhi: బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న ప్రధాని మోదీ.. ఘనంగా స్వాగతం పలికిన కాషాయ నేతలు
కాగా, ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. “తెలంగాణలో మోనిన్ తమ కార్యకలాపాలను ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమర్ధవంతమైన నాయకత్వంలో, పెట్టుబడిదారులు తెలంగాణలోకి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా మా విధానాలను సరళీకృతం చేయడానికి వీలైనంతగా మేము అన్ని ప్రయత్నాలను చేసాము. రాష్ట్రంలో పెట్టుబడిదారుల సుదీర్ఘ జాబితాలో మోనిన్ చేరడంతో, తెలంగాణ ఆహార ప్రాసెసింగ్ పర్యావరణ వ్యవస్థ మరో మెట్టు పైకి వెళ్లింది. తెలంగాణను తమ హబ్‌గా మార్చు కోవాల్సిందిగా నేను మోనిన్‌ని కోరుతున్నాను’’ అని అన్నారు.
INDIA bloc: ఇండియా సమన్వయ కమిటీ తొలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే
ఇక ఓలివర్ మోనిన్ మాట్లాడుతూ “భారతదేశం, గత కొన్ని సంవత్సరాలుగా, అగ్ర శ్రేణి ప్రాధాన్యత మార్కెట్‌గా మారింది. ఇది భారతదేశంలో పూర్తిగా మా యాజమాన్య అనుబంధ సంస్థను స్థాపించడానికి మమ్మల్ని పురికొల్పింది. ఒడిసి పట్టని దాని వాణిజ్య సంభావ్యత పరంగా మాత్రమే కాదు, ఇప్పటికే వైవిధ్యం, ప్రతిభ, ఆవిష్కరణలతో నిండిన దేశానికి సేవ చేయడంలో ఉన్న థ్రిల్ కారణంగా కూడా మోనిన్‌కు ఒక ముఖ్యమైన మార్కెట్ గా ఇండియా నిలుస్తుంది’’ అని అన్నారు.