KTR Reply to Anand Mahindra : డియర్ ఆనంద్ జీ.. మీకు తెలుసా? అంటూ ఆనంద్ మహీంద్రాకు కేటీఆర్ రిప్లై

ఇటీవల ఆనంద్ మహీంద్ర పెట్టిన ఓ పోస్ట్‌కి మంత్రి కేటీఆర్ రిప్లై ఇచ్చారు. ఆనంద్ మహీంద్రా ఏం ట్వీట్ చేశారు? కేటీఆర్ రిప్లై ఏంటి?

KTR Tweet to Anand Mahindra : హైదరాబాద్ అభివృద్ధిలో దినదిన ప్రవర్థమానంగా దూసుకుపోతోంది. ప్రపంచ దేశాల్లో పేరున్న సంస్థల్ని ఆకర్షిస్తోంది. గూగుల్ వంటి సంస్థలు తమ కార్యాలయాలు నిర్మించడానికి హైదరాబాద్‌ను ఎంచుకోవడంపై పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఓ ట్వీట్ పెట్టారు. ఆయన ట్వీట్‌కి మంత్రి కేటీఆర్ రిప్లై చేయడంతో వైరల్ అవుతోంది.

ఇటీవల ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. ‘గూగుల్ వంటి దిగ్గజ సంస్థ అమెరికా కాకుండా బయట ఎక్కడైనా తమ క్యాంపస్‌ను నిర్మించాలనుకున్నప్పుడు ఓ దేశాన్ని ఎంపిక చేసుకోవడం వెనుక కేవలం వ్యాపార విషయంలోనే కాదు.. అక్కడ భౌగోళిక రాజకీయాలకు కూడా ప్రాధాన్యం ఉందని’ అనే శీర్షికతో తను పెట్టిన పోస్ట్ కి గూగుల్ హైదరాబాద్‌లో నిర్మించతలపెట్టిన అతిపెద్ద కార్యాలయానికి సంబంధించిన ఫోటోను కూడా యాడ్ చేశారు.

ఆనంద్ మహీంద్రా పోస్ట్‌పై తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ స్పందించారు. ‘డియర్ ఆనంద్ జీ.. ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ క్యాంపస్ హైదరాబాద్‌లో ఉందని మీకు తెలుసా? అలాగే Apple, Meta, Qualcomm, Micron, Novartis, Medtronic, Uber, Salesforce మరియు మరెన్నో రెండవ అతిపెద్ద క్యాంపస్‌లు కూడా గత 9 సంవత్సరాలలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబడ్డాయి. అందుకే #HappeningHyderabad అని పిలుస్తాను’ అంటూ ఆనంద్ మహీంద్రా పోస్ట్‌కి రిప్లై చేశారు. అంతేకాదు అమెజాన్ కార్యాలయం ఫోటోను తన రిప్లైకి యాడ్ చేశారు. మహీంద్రా పోస్ట్‌కి కేటీఆర్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు వైరల్ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు