Minister KTR
Minister KTR: రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ (Minister KTR) సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Sirisilla District) లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లోని పలు గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాల (Ambedkar statues) ను మంత్రి ఆవిష్కరించనున్నారు. ఏప్రిల్ 14న బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి (Dr. BR Ambedkar Jayanti) ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటించి పలు గ్రామాల్లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు.
KTR : అందుకే అంటున్న ప్రియమైన ప్రధాని.. మోదీ కాదు: కేటీఆర్ సెటైర్లు
మంత్రి కేటీఆర్ పర్యటన ఇలా..
– ఉదయం 10.30 గంటలకు తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామంకు చేరుకుంటారు.
– గ్రామంలో అంబేద్కర్, చాకలి ఐలమ్మ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. అదే గ్రామంలో ఎస్సీ, ముదిరాజ్ సంఘం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
– రూ. 1.50 కోట్లతో ఏర్పాటు చేసిన సబ్ స్టేషన్ భవనాన్ని ప్రారంభిస్తారు.
– లక్ష్మీపూర్ పల్లె గ్రామంకు చేరుకొని పల్లె దవాఖానను ప్రారంభిస్తారు.
– 11.30 గంటలకు పాపయ్యపల్లెలో రూ. 26లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తారు.
– మధ్యాహ్నం 12 గంటలకు గోపాల్‌రావు పల్లెలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తంగళ్లపల్లిలోని పీహెచ్ సీలోని ఫిజియోథెరపీ సేవలను ప్రారంభిస్తారు.
– మధ్యాహ్నం 1.30 గంటకు గండిలచ్చపేటకు చేరుకుంటారు. గ్రామంలో అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావుపూలే విగ్రహాలను ఆవిష్కరిస్తారు.
– దళితబంధు పథకం కింద ఏర్పాటు చేసిన ఫౌల్ట్రీఫాంను మంత్రి కేటీఆర్ ప్రారంభించి, అక్కడే దళిత బంధు లబ్ధిదారులతో సహపంక్తి భోజనం చేస్తారు.
– మధ్యాహ్నం 2.30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
– మధ్యాహ్నం 3.30 గంటలకు బుగ్గ రాజేశ్వరతండా చేరుకొని రూ. 20లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని, అనంతరం రూ. 9.60 లక్షలతో నిర్మించిన గిరిజన కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభిస్తారు.
– సాయంత్రం 4గంటలకు రాచర్ల గుండారంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
– సాయంత్రం 5గంటలకు గంభీరావుపేట మండలం గోరంట్యాలలో అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. అనంతరం హైదరాబాద్ తిరుగుపయణం అవుతారు.