Ponguleti Srinivasa Reddy
Ponguleti Srinivasa Reddy: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ విషయంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక విషయాన్ని వెల్లడించారు. ఖమ్మంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు.
సోమవారం క్యాబినెట్‌లో చర్చించి ఎన్నికల తేదీపై నిర్ణయం వెల్లడిస్తామని మంత్రి పొంగులేటి అన్నారు. అయితే, తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని, అనంతరం సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పదిహేను రోజుల గడువు మాత్రమే ఉందని, కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని, గెలిచే అవకాశాలున్న అభ్యర్థులనే ఎంపిక చేస్తామని పొంగులేటి అన్నారు.
మరోవైపు రేపు (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ చర్చించనుంది. కేబినెట్ సమావేశం అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్, తేదీలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.