తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం దేశానికే ఆదర్శం కానుంది : మంత్రి పొన్నం

కాంగ్రెస్ మేనిఫెస్టో లో చెప్పిన ప్రకారం కులగణన అసెంబ్లీలో తీర్మానం చేశామని, కులగణన ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Minister Ponnam Prabhakar

Minister Ponnam Prabhakar : కులగణనపై బీఆర్ఎస్ నేతలు కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పదేళ్లలో కుల గణనపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం కాళ్లల్లో కట్టెపెట్టేలా మాజీ మంత్రి గంగుల వ్యాఖ్యలు ఉన్నాయని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వేను ఎందుకు బయట పెట్టలేదో బీఆర్ఎస్ చెప్పాలని అన్నారు. కుల గణనపై ఎవరికీ అనుమానం లేదు.. అందరి ఆలోచనలు తీసుకుంటాం. కుల గణన కాంగ్రెస్ పార్టీ కమిట్ మెంట్ అని పొన్నం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం దేశానికి ఆదర్శం కానుందని, చారిత్రాత్మక ఘట్టంలో పాలు పంచుకోవడం నా అదృష్టం అని పొన్నం పేర్కొన్నారు.

Also Read : వ్య‌వ‌సాయ సాంకేతిక‌త‌లో తెలంగాణ‌ను అగ్ర‌స్థానంలో నిల‌పాలి: మంత్రి తుమ్మ‌ల

కాంగ్రెస్ మేనిఫెస్టో లో చెప్పిన ప్రకారం కులగణన అసెంబ్లీలో తీర్మానం చేశామని, కులగణన ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మేము ఎవ్వరికీ వ్యతిరేకం కాదు.. అన్ని పార్టీల ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్నాం. మాజీ మంత్రి గంగుల కమలాకర్ తీర్మానంపై అనుమానం వ్యక్తం చేయడం శోచనీయం. ఆ మాజీ మంత్రికి బీసీల పట్ల చిత్తశుద్ది ఉంటే సకల జనుల సర్వేను బయటపెట్టాలని గతంలో వాళ్ల ప్రభుత్వాన్ని అడిగారా? అనుమానాలు పక్కన పెట్టి ఇప్పటికే కులగణన జరిపిన ఆయా రాష్ట్రాల నుంచి తెలుసుకోవాలి. మురళీధర్ కమిషన్ నుంచి తెలంగాణ ఉద్యమం, పార్లమెంట్ లో బిల్లు ఆమోదం వరకు మేము ఉన్నాం అని మంత్రి బొత్స అన్నారు.

Also Read : గొంతు పిసికి చంపాలని చూస్తారా? వైఎస్ షర్మిల సంచలన ట్వీట్

కులగణన మా ప్రభుత్వ సాహసోపేత నిర్ణయం అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రతిపక్షాలు రాద్దాంతం మానుకోవాలి. పదేళ్లు బీసీలను బీఆర్ఎస్, బీజేపీలు పట్టించుకోలేదు. కుల గణన చేస్తాం. బలహీన వర్గాలను అన్ని రంగాల్లో అభివృద్ధికి బాటలు వేస్తామని చెప్పారు.