కేటీఆర్, హరీశ్ దొరతనం మరోసారి బయటపడింది: మంత్రి సీతక్క

నిరసనలో కూడా బీఆర్ఎస్ నేతల్లో సమానత్వం లేదని చెప్పారు.

Seethakka

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రి సీతక్క మీడియాతో చిట్ చాట్ చేశారు. బీఆర్ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేశారు తప్పా కేటీఆర్, హరీశ్ రావు మాత్రం బేడీలు వేసుకోలేదని అన్నారు.

కేటీఆర్, హరీశ్ దొరతనం మరోసారి బయటపడిందని అన్నారు. నిరసనలో కూడా బీఆర్ఎస్ నేతల్లో సమానత్వం లేదని చెప్పారు. నిరసనల్లో కూడా తమ దురహంకారాన్ని ప్రదర్శించారని తెలిపారు. రైతులకు బేడీలు వేయడంపై బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదని అన్నారు.

బీఆర్ఎస్ హయాంలో రైతులకు కనీసం పదిసార్లు బేడీలు వేశారని సీతక్క తెలిపారు. కనీసం అప్పుడు అధికారుల మీద చర్యలు లేవని అన్నారు. రైతులకు బేడీలు వేసిన అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయి చర్యలు కూడా తీసుకున్నారని తెలిపారు.

సభలో వాళ్లు పెట్టిన రూల్స్ పై వాళ్లే అభ్యంతరం చెప్పడం ఏంటని సీతక్క ప్రశ్నించారు. గతంలో వెల్ లోకి వస్తె సభ నుంచి సస్పెండ్ చేసేవారని తెలిపారు. కానీ ఇప్పుడు వాళ్లు పెట్టిన నిబంధనలనే వాళ్లు కాలరాస్తున్నారని చెప్పారు.

MLC Kavitha: శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు.. రేవంత్ సర్కార్ కు సూటి ప్రశ్న