Seethakka
తెలంగాణ మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి సీఎం రేవంత్ సభకు జన సమీకరణ చేయాలని అనధికారంగా ఆమె సూచిస్తూ పలు వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ఎవరు ఎక్కువ జన సమీకరణ చేస్తే.. అంత ఎక్కువ నిధులు ఇస్తానని సీతక్క అన్నారు.
ఇంద్రవెల్లి ఎంపీడీవోతో మంత్రి సీతక్క మాట్లాడుతున్న వీడియో వైరల్‌గా మారింది. కాంగ్రెస్ సభ జన సమీకరణ కోసం ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఎలా ఇస్తారంటూ విపక్షాల మండిపడుతున్నాయి. సీఎం సభకు జనాలను పంపిస్తేనే నిధులు కేటాయిస్తారా అంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
కాగా, ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి నుంచే కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఆయన పర్యటన నేపథ్యంలో సభ ఏర్పాట్లను సీతక్క పరిశీలించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన సమయంలో ఇంద్రవెల్లిలోనే భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సీఎం హోదాలోనూ తొలి సభను అక్కడే నిర్వహిస్తున్నారు.
Also Read: ‘ఆ స్థానంలో నాకే టికెట్ ఇవ్వాలి’.. దుర్గమ్మ సన్నిధి నుంచి ర్యాలీకి బుద్ధా వెంకన్న సిద్ధం