కేటీఆర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి సీతక్క.. నీ సొంత చెల్లే ..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Seethakka

Seethakka: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కేటీఆర్ కు అర్ధం కానట్లుంది. విదేశాల్లో ఉన్న కేటీఆర్ తాను తెలంగాణకు వచ్చినట్లు చెప్పేందుకే మీడియా సమావేశం పెట్టినట్లు ఉందని ఎద్దేవా చేశారు. కేటీఆర్ గుర్తింపు సమస్యతో బాధపడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావడం లేదంటూ సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: రేవంత్ రెడ్డి సవాల్‌ను నేను స్వీకరిస్తున్నా.. 8వ తేదీన చర్చ పెట్టుకుందాం.. : కేటీఆర్ ప్రతిసవాల్

అసెంబ్లీలో చర్చిద్దాం రా అంటే.. కేటీఆర్ ప్రెస్‌క్లబ్‌కు రమ్మనడం ఏంటి? ప్రజలు ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంది ప్రెస్‌క్లబ్‌లో చర్చించడానికి కాదు. 72 గంటల డెడ్‌లైన్ అంటూ అర్ధంపర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారంటూ కేటీఆర్ తీరుపై సీతక్క మండిపడ్డారు.

బీఆర్ఎస్ డెడ్ అయిన పార్టీ.. డెడ్‌లైన్ పెట్టడం విడ్డూంగా ఉంది. కేటీఆర్.. నీ సొంత చెళ్లే నిన్ను నాయకుడిగా గుర్తించడం లేదంటూ సీతక్క ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడా..? సమస్యలపై చర్చిద్దాం రా అంటే భయమెందుకు అంటూ సీతక్క ప్రశ్నించారు.