Miss World 2025: హైద‌రాబాద్‌లో మిస్ వరల్డ్ ఈవెంట్.. ఫ్రీ ఎంట్రీ పాస్‌ కావాలా..? జస్ట్ ఇలా చేయండి..

ప్రపంచ అందాల పోటీల్లో పాల్గొనేందుకు 100కి పైగా దేశాల నుండి అందగత్తెలు వస్తున్నారు. అయితే, సామాన్య ప్రజలు కూడా ఈ ఈవెంట్ కి హాజరయ్యే అవకాశాన్ని తెలంగాణ టూరిజం శాఖ కల్పిస్తుంది.

Miss World 2025 Events

Miss World 2025: మిస్ వరల్డ్ -2025 పోటీలు హైదరాబాద్ వేదికగా జరగబోతున్నాయి. ఈనెల 10వ తేదీ నుంచి హైదరాబాద్ వేదికగా అందాల పోటీలను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 100కి పైగా దేశాల నుంచి అందాల భామలు ఈ పోటీల్లో పాల్గోనున్నారు. తెలంగాణ కల్చర్, హెరిటేజ్, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ దేశాలకు పరిచయం చేసేలా వివిధ కార్యక్రమాలతో 20రోజుల ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. మే 10వ తేదీన గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ నృత్య ప్రదర్శనలతో ఈవెంట్ ప్రారంభమై.. ఈనెల 31వ తేదీన ముగుస్తుంది.

Also Read: Hari Hara Veera Mallu : పవన్ ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ‘బుక్ మై షో’.. ఎప్పుడో తెలుసా?

ప్రపంచ అందాల పోటీల్లో పాల్గొనేందుకు 100కి పైగా దేశాల నుండి అందగత్తెలు వస్తున్నారు. అయితే, సామాన్య ప్రజలు కూడా ఈ ఈవెంట్ కి హాజరయ్యే అవకాశాన్ని తెలంగాణ టూరిజం శాఖ కల్పిస్తుంది. నేరుగా అందాల పోటీలను వీక్షించేందుకు ఉచిత ఎంట్రీ పాస్ లను అందిస్తోంది. అయితే, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ఉచిత టిక్కెట్లను పొందవచ్చు.

 

ఉచిత పాస్‌లు కోసం ఇలా చేయండి..
♦ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ టూరిజం వెబ్ సైట్ ద్వారా ఉచిత ప్రవేశ టికెట్లను అందిస్తోంది.
♦ ఆసక్తి ఉన్న వ్యక్తులు అధికారిక పోర్టల్ లోకి వెళ్లి ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేయాలి.
♦ తొలుత తెలంగాణ పర్యాటక అధికారిక వెబ్ సైట్ tourism.telangana.gov.in లోకి వెళ్లండి.
♦ మిస్ వరల్డ్ ఈవెంట్ పై క్లిక్ చేయండి.
♦ మీ మెయిల్, ఆధార్, ఫోన్ నెంబర్, వయస్సు తదితర వివరాలు ఎంటర్ చేయండి.
♦ అందులో అడిగిన ఐదు ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.
♦ ప్రక్రియ అంతా పూర్తయిన తరువాత సబ్మిట్ పై క్లిక్ చేయండి.
♦ మీ పాస్ లను బాక్స్ ఆఫీస్, గచ్చిబౌలి స్టేడియంలో మే8వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయి.

 

మిస్ వరల్డ్ 2025 ఈవెంట్ ను ఎక్కడ..? ఎలా చూడాలి?
మిస్ వరల్డ్ 2025 ఈవెంట్ ఈనెల 31వ తేదీ వరకు జరుగుతుంది. బ్యూటీ విత్ ఎ పర్పస్ అనే నినాదంతో జరిగే మిస్ వరల్డ్ పోటీని మిస్ వరల్డ్ యూట్యూబ్ ఛానెల్ www.youtube.com/@missworld లో ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు. ఎప్పటికప్పుడు సమాచారం www.missworld.com లో అందుబాటులో ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లోనూ క్రమం తప్పకుండా వివరాలను తెలియజేస్తారు.