constable preliminary exam
Constable Preliminary Exam : తెలంగాణలో కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో తప్పులు బయటపడ్డాయి. ప్రిలిమినరీ పరీక్షలో 13 ప్రశ్నలు గందరగోళం ఉన్నట్టుగా నిపుణులు గుర్తించారు. దీనిపై ఎక్కువ సంఖ్యలో అబ్జెక్షన్స్ వస్తే మార్కులు కలిపే ఛాన్స్ ఉందని, అందులో 8 మార్కుల వరకు యాడ్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
పలు ప్రశ్నల్లోని అప్షన్స్‌లో సమాధానాలు నాలుగు ఉండగా… ఇంకొన్ని అప్షన్స్‌లో నాలుగు రాంగ్ ఆన్సర్స్ ఉన్నట్టుగా నిపుణులు చెప్తున్నారు. ఇంతకుముందు జరిగిన ఎస్సై ఎగ్జామ్ లో కూడా ఇలాంటి సమస్యలే తలెత్తడంతో మార్కులు కలిపారు.
తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఆదివారం ప్రాథమిక రాత పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు 6,03,955 మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,601 కేంద్రాల్లో పరీక్ష జరిగింది.
తెలంగాణలోని 35 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 15,644 పోస్టులకుగాను, 9.54 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో పోలిస్తే హాజరు శాతం 91.34 శాతంగా ఉంది.