Mla Anirudh Reddy: ఎక్కువ ప్యాకేజీ ఇస్తే జగన్ కి కూడా మద్దతిస్తారు..!- పవన్ కల్యాణ్ పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్
గ్లామర్ కాపాడుకోవడం కోసమే పవన్ హైదరాబాద్ లో ఉంటున్నారు. టీటీడీ డబ్బులపై కూడా పవన్ రాజకీయం చేస్తున్నారు?
- Naveen
- Updated on- June 2, 2026 / 08:07 PM IST
Mla Anirudh Reddy: తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణకు రావొద్దని నన్ను బెదిరించడానికి మీరెవరు? తెలంగాణ మీ అయ్య జాగీరా? అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సినీ పరిశ్రమలో ప్యాకేజ్ ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ల సినిమాలో నటిస్తారు.. రాజకీయాల్లో సైతం ప్యాకేజీ ఎక్కువ ఇచ్చిన వాళ్ళకే పవన్ మద్దతిస్తున్నారు అని అనిరుధ్ రెడ్డి విమర్శించారు. జగన్ ఎక్కువ ప్యాకేజీ ఇస్తే పవన్ ఆయనకి కూడా మద్దతిస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబును జైల్లో కలవడమే పవన్ ప్లస్ పాయింట్ అని అన్నారు.
”పవన్ కల్యాణ్ తెలంగాణకి క్షమాపణ చెప్తారని అనుకున్నా. నరదృష్టి ఉన్న దగ్గరికి పవన్ ఎందుకు రావాలి? పవన్ వెళ్ళి గుజరాత్ లో పోటీ చేయాలి. నల్లగా అయిపోతాననే పవన్ విజయవాడ వెళ్ళడం లేదు. గ్లామర్ కాపాడుకోవడం కోసమే పవన్ హైదరాబాద్ లో ఉంటున్నారు. టీటీడీ డబ్బులపై కూడా పవన్ రాజకీయం చేస్తున్నారు? పవన్ ఇంగ్లీషులో మాట్లాడింది అమిత్ షా కి అర్థం కావడానికే. కేసీఆర్, అమిత్ షాను ఇంప్రెస్ చేయడానికే పవన్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కి భూముల వ్యవహారమే తెలీదు. పవన్ కబ్జా చేసిన భూమి దగ్గరికి వెళ్తే కేసులు పెడతారా? రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిన వ్యక్తి పవన్ కళ్యాణ్. రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి పవన్ డిప్రెషన్ లో ఉన్నారు” అని అనిరుధ్ రెడ్డి అన్నారు.
”బీజేపీ నుంచో బీఆర్ఎస్ నుంచో పవన్ కల్యాణ్ కు డబ్బులు వస్తున్నాయి. ఏపీలో ఏమీ చేయలేని వ్యక్తి తెలంగాణకు వచ్చి ఏం చేస్తారు? పవన్ అహంకారంతో మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ ను కాపాడుకుంటూ పవన్ మాట్లాడారు. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయొద్దని, రాజ్యసభ టికెట్ తీసుకోవద్దని ఆరోజు పవన్ ఎందుకు చెప్పలేదు? ఆరోజు అలా మాట్లాడారు.
ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వారికి అనుకూలంగా మాట్లాడుతున్నారా? ఏపీ, తమిళనాడులో రాజకీయాలు ఎలా ఉంటాయంటే.. ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వాలు మారుతుంటాయి. తెలంగాణలో పదేళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారుతుంటాయి. ఏపీలోనే న్యాయం చేయలేకపోయారు. డిప్యూటీ సీఎం అయ్యాక హైదరాబాద్ లో ఎన్ని రోజులు ఉన్నారు? విజయవాడలో ఎన్నిరోజులు ఉన్నారో పవన్ కల్యాణ్ చెప్పాలి” అని అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు.
Also Read: తెలంగాణలో తిరుగుతాం, పోటీ చేస్తాం.. ఇదేమైనా పాకిస్తానా?- పవన్ కల్యాణ్
