Komatireddy Raj Gopal Reddy Revanth Reddy
Komatireddy Raj Gopal Reddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గవిబేధాలు భగ్గుమన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రోజాగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్‌ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరంటూ రేవంత్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు సభలో మాట్లాడుతూ.. 2034వరకు ఇంకో పదేళ్ల పాటు పాలమూరు బిడ్డనే ముఖ్యమంత్రిగా ఉంటారు. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పాలమూరు ప్రాజెక్టులను పూర్తిచేసే బాధ్యత నేను తీసుకుంటానని రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ వ్యాఖ్యలను తప్పుబడుతూ ట్విటర్ వేదికగా రాజగోపాల్ రెడ్డి స్పందించారు.
రాబోయే పదేళ్లు నేను ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్టానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్దంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు. అంటూ రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం.
జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను… pic.twitter.com/nGtGpQzgGk— Komatireddy Raj Gopal Reddy (@rajgopalreddy_K) July 19, 2025