Ts News
Ts News : రాష్ట్ర మంత్రులకు నియోజకవర్గ అభివృద్ధి పట్టడం లేదని.. ఇతర పార్టీల వారిని చేర్చుకోవడమే పనిగా ఉందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చండూరులో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. మంత్రి జగదీశ్ రెడ్డి మునుగోడు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. జగదీష్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో సూర్యాపేటలో గెలిచి చూపించు అంటూ సవాల్ విసిరారు కోమటిరెడ్డి. గెలిస్తే తాను దేనికైనా సిద్ధమని తెలిపారు.
Read More : Wife Illegal Affair : ప్రియుడితో కలిసి బస్సులో వెళుతున్న భార్యను నరికేసిన భర్త
నీకిదే చివరి ఎన్నిక అంటూ జగదీశ్ రెడ్డిపై ధ్వజమెత్తారు. మంత్రి, టీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోవాలని తెలిపారు. హుజూరాబాద్ మాదిరిగానే మునుగోడులో కూడా దళిత బందు అమలు చేయాలనీ డిమాండ్ చేశాడు రాజగోపాల్ రెడ్డి. మునుగోడులో దళిత బంధు అమలు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తన ఛాలెంజ్ స్వీకరించి.. దళిత బంధు అమలు చేయాలనీ కోరారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
Read More : Somu Veerraju : బద్వేల్ ఉపఎన్నిక.. బీజేపీ కీలక నిర్ణయం