Rajaiah fire Kadiam Srihari
Rajaiah Allegations Kadiam Srihari : ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కడియం శ్రీహరి ఓ పెద్ద అవినీతి తిమింగలమని.. భారీగా ఆస్తులు కూడ బెట్టారని విమర్శించారు. మంత్రిగా ఉన్న సమయంలో కడియం అనినీతి చేశారని ఆరోపించారు. అవసరం వచ్చినప్పుడు కడియం ఆస్తులను బయట పెడతామని చెప్పారు. అభివృద్ధి విషయంలో అప్పర్ హ్యాండ్ తనదేనని చెప్పారు.
అభివృద్ధిపై చర్చించడానికి స్థలమేదైనా, సబ్జెక్లు ఏదైనా, దేనికైనా సిద్ధమంటూ కడియంకు రాజయ్య సవాల్ విసిరారు. ఎవరెన్ని కుట్రలు చేసినా స్టేషన్ ఘన్ పూర్ తనదేనని ధీమా వ్యక్తం చేశారు. స్టేషన్ ఘన్ పూర్ లో ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇన్ని రోజులు పరోక్షంగా విమర్శించుకున్న నేతలు ఇప్పుడు ప్రత్యక్షంగా విమర్శించుకుంటున్నారు. పేర్లు పెట్టి మరీ మాటల దాడికి దిగుతున్నారు.
కడియ శ్రీహరి.. నియోజకవర్గంలో పర్యటిస్తూ క్యాడర్ ను సమాయత్తం చేసుకోవడంపై రాజయ్య అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. దీనికి తోడు కొద్ది రోజులుగా నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు బాగా పెరిగిపోయాయంటూ కడియం ఆరోపిస్తూవస్తున్నారు. ఇక స్టేషన్ ఘన్ పూర్ లో అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా కడియం పాల్గొంటూ వస్తున్నారు. దీంతో రాజయ్య వర్గం కడియం వర్గంపై గుర్రుగా ఉంది.
నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే బాస్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాక కూడా ఇలా పొలిటికల్ గా దృష్టి పెట్టే ప్రయత్నం చేయడం సరికాదని రాజయ్య వర్గం అంటోంది. ఇదే సమయంలో రాజయ్యపై అవినీతి ఆరోపణలతోపాటు వ్యక్తిగత విషయంలో తీవ్రమైన వివాదాలు, విమ్శరలు వస్తూవుండటంతో ఈసారి కడియంకే టికెట్ వస్తుందన్న ధీమాను ఆయన అనుచరులు గ్రౌండ్ లో చెప్పుకుంటున్నారు.