MLA Rajasingh : ‘దేవిశ్రీ ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలి’.. హైదరాబాద్‌ సీపీకి ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖ

పుష్ప ఐటెం సాంగ్‌పై రచ్చ ఆగడం లేదు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖ రాశారు. దేవిశ్రీ ప్రసాద్‌ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు.

MLA Rajasingh letter to the Hyderabad CP : పుష్ప సినిమాలోని ఊ అంటావా పాట మరో వివాదంలో చిక్కుకుంది. ఈ పాటపై మ్యూజిక్ డైరెక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఏ పాట అయినా తనకు ఒకటే అంటూ దేవి చేసిన కామెంట్స్‌ బాగానే ఉన్నా.. ప్రతి ఐటమ్‌ సాంగ్ డివోషనలే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

తన దృష్టిలో ఊ అంటావా సాంగ్‌ బెస్ట్‌ డివోషనల్‌ సాంగ్ అన్నారు దేవిశ్రీ ప్రసాద్‌.. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. హిందువుల మనోభావాలను కించపరిచారని మండిపడ్డారు. హిందువులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. క్షమాపణలు చెప్పకుంటే తెలంగాణలో అడుగు పెట్టనివ్వబోమని వార్నింగ్ ఇచ్చారు.

CM KCR : తెలంగాణలో కొత్త జోనల్ ప్రకారమే ఉద్యోగుల విభజన : సీఎం కేసీఆర్

పుష్ప ఐటెం సాంగ్‌పై రచ్చ ఆగడం లేదు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖ రాశారు. దేవిశ్రీ ప్రసాద్‌ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. దేవిశ్రీప్రసాద్‌ వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దేవిశ్రీ ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని రాజాసింగ్‌ కోరారు.

దేవిశ్రీ ప్రసాద్‌ కామెంట్స్‌ దానిపై రాజాసింగ్‌ వార్నింగ్‌తో సీన్‌ ఒక్కసారిగా మారిపోయింది. డివోషనల్‌ సాంగ్స్‌ను ఐటమ్‌ సాంగ్స్‌కు ముడిపెట్టడంపై రాజాసింగ్ మండిపడ్డారు. క్షమాపణలు చెప్పకుండా తెలంగాణలో ఎలా తిరుగుతావో చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

Road Accident : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి

మరోవైపు ప్రముఖ గాయని శోభారాజ్‌ కూడా ఊ అంటావా ట్యూన్‌తో మాధవుడిపై పాట పాడారన్నారు దేవిశ్రీ ప్రసాద్. తన పాటకు అంతకన్నా గొప్ప గౌరవం ఇంకేమీ ఉండదన్నారు. సంగీతాన్ని దేనికైనా వాడుకోవచ్చని.. ఊ అంటావా ఐటమ్‌ సాంగ్‌ను డివోషనల్‌ సాంగ్‌గా మార్చిన శోభారాజ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు