CM KCR : తెలంగాణలో కొత్త జోనల్ ప్రకారమే ఉద్యోగుల విభజన : సీఎం కేసీఆర్

మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగులు పనిచేస్తేనే సమగ్రాభివృద్ధి జరుగుతుందన్నారు. ఉద్యోగుల విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని పేర్కొన్నారు.

CM KCR : తెలంగాణలో కొత్త జోనల్ ప్రకారమే ఉద్యోగుల విభజన : సీఎం కేసీఆర్

Cm Kcr

The process of separation of employees : తెలంగాణలో కొత్త జోనల్ ప్రకారమే ఉద్యోగుల విభజన జరుగుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. నాలుగు, ఐదు రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. శనివారం (డిసెంబర్ 18,2021)న హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. స్థానిక యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యమన్నారు.

మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగులు పనిచేస్తేనే సమగ్రాభివృద్ధి జరుగుతుందన్నారు. ఉద్యోగుల విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని పేర్కొన్నారు. స్థానిక యువతకు ఉద్యోగాల కల్పించే విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. స్థానికులకు ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశ్యంతో జోనల్ వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు.

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి

కొత్త జోనల్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు. కొత్త జోనల్ విధానం ప్రకారమే ఉద్యోగుల పదోన్నతులు, క్రమబద్ధీకరణ చేపట్టాలని ఆదేశించారు. వెనుకబడిన ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగులు పని చేసే విధంగా చూడాలని కలెక్టర్లకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.