MLA Fishing In Pond : చెరువులో చేపలు పట్టిన ఎమ్మెల్యే

తెలంగాణ ఉద్యమ సమయంలో తన ఆటాపాటతో అందరినీ ఉత్తేజ పరిచిన రసమయి బాలకిషన్ తర్వాత కాలంలో ఎమ్మెల్యే అయిన సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన మాన కొండూరు మండలంలో చేపలు పట్టి అందరినీ ఉత్సాహ పరిచారు.

Rasamayi Fishing

MLA Fishing In Pond  :  తెలంగాణ ఉద్యమ సమయంలో తన ఆటాపాటతో అందరినీ ఉత్తేజ పరిచిన రసమయి బాలకిషన్ తర్వాత కాలంలో ఎమ్మెల్యే అయిన సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన మాన కొండూరు మండలంలో చేపలు పట్టి అందరినీ ఉత్సాహ పరిచారు. ఆట పాటలతోనే కాదు   వలవిసిరి కూడా చేపలు పడతానన్నారు ఆయన.

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలోని పలు   లోతట్టు  ప్రాంతాలు జలమయమయ్యాయి. కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు నియోజకవర్గంలో ఈరోజు ఉదయం తొలిపొద్దు కార్యక్రమాన్ని ముగించుకుని క్యాంపు కార్యాలయానికి తిరిగి వెళుతున్న రసమయి మానకొండూర్ చెరువును పరిశీలించటానికి   ఆగారు.  చెరువు వాననీటితో పూర్తిగా నిండి మత్తడి దూకుతోంది.

అక్కడ స్ధానిక మత్స్యకారులు చేపలు పట్టాడాన్ని గమనించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వారి వద్దకు వెళ్లి వారిని పలకరించారు. వారిలో ఒకరి వద్ద ఉన్న చేపల వల తీసుకుని తాను కూడా మత్స్యకారుడిగా మారి చెరువులోకి వల విసిరి చేపలు పట్టారు. రసమయి విసిరిన వలలో పెద్ద చేపలు పడ్డాయి. దాదాపు అరగంట సేపు ఆయన వారితో కలిసి చేపలు పట్టటంతో మత్స్యకారులు సంతోషం వెలిబుచ్చారు.  కాగా రసమయి బాలకిషన్ గతంలో కూడా వానాకాలంలో   మత్స్యకారులతో కలిసి చేపలు పట్టిన సందర్భాలు ఉన్నాయి.