×
Ad

MLA Shakeel : దమ్ముంటే ముందు నుండి కొట్లాడండి వెనక నుండి కాదు.. అసదుద్దీన్ కి ఎమ్మెల్యే షకీల్ సవాల్

బోధన్ బీఆర్ఎస్ నేత శరత్ రెడ్డి, ఎంఐఎం నేతలు కలిసి తనపై కుట్రలు చేస్తున్నారని.. వీరిపై పీడీ యాక్టు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

  • Published On : June 30, 2023 / 09:41 AM IST

Shakeel counter Asaduddin

Shakeel Counter Asaduddin : ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీకి బోధన్ ఎమ్మెల్యే షకీల్ కౌంటర్ ఇచ్చారు. అసదుద్దీన్ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు రాగానే ఆయన నైజం భయటపెడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో చూసుకుందామని బెదిరిస్తే భయపడే వారు లేరని స్పష్టం చేశారు. దమ్ముంటే ముందు నుండి కొట్లాడండి.. వెనక నుండి కాదు అని సవాల్ చేశారు.

తాను ఎవరిపై తప్పుడు కేసులు పెట్టలేదన్నారు. తనపై ఎంఐఎం కౌన్సిలర్లు ముమ్మాటికీ హత్యాయత్నం చేశారని ఆరోపించారు. ప్లాన్ ప్రకారమే ఆ రోజు తనపై దాడి చేసి, తనను చంపాలనుకున్నారని పేర్కొన్నారు. జైల్లో ఉన్న నిందితులపై సంఘ విద్రోహ కేసులున్నాయని తెలిపారు. దొంగతనం, రౌడీయిజం, మర్డర్ ఇలా వారిపై చాలా కేసులున్నాయని వెల్లడించారు.

Podu Land Pattas : ఫలించిన పోడు భూముల పోరాటం… అసిఫాబాద్ వేదికగా నేడు గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ

బోధన్ బీఆర్ఎస్ నేత శరత్ రెడ్డి, ఎంఐఎం నేతలు కలిసి తనపై కుట్రలు చేస్తున్నారని.. వీరిపై పీడీ యాక్టు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రెండు సంవత్సరాల వరకు వారు జైల్లోనే ఉండాలన్నారు. నిజానిజాలు పోలీసులే తేలుస్తారని చెప్పారు. బోధన్ ప్రజలు తనతోనే ఉన్నారని.. ఈ సారి ఎన్నికల్లో తేల్చుకుందామని ఛాలెంజ్ చేశారు.