Mla Shakil: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబీకుల రైస్ మిల్లుల్లో అధికారుల తనిఖీలు

కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) కోటాలో ధాన్యం తిరిగివ్వని మిల్లుల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు.

Mla Shakil Custom Milling Rice

Nizamabad: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబీకుల రైస్ మిల్లులపై పౌర సరఫరాల శాఖ అధికారుల తనిఖీలు చేస్తున్నారు. దాదాపు రూ.9 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం మటుమాయమైనట్లు తెలుస్తోంది. ధాన్యం కోసం వెళితే రైస్ మిల్‌లో ధాన్యం లేకపోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.

కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) కోటాలో ధాన్యం తిరిగివ్వని మిల్లుల్లో 2 రోజులుగా అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆ ధాన్యాన్ని నిజామాబాద్‌ జిల్లాలోని కొందరు మిల్లర్లు పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. మొత్తం రూ.70 కోట్ల విలువ చేసే 33,328 టన్నుల ధాన్యం పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు.

వాటికి సంబంధించిన లెక్కలు లేవని చెప్పారు. ఈ ధాన్యం 2021-22 ఏడాదిలోని యాసంగి, అలాగే, 2022-23 వర్షాకాల సీజన్లకు సంబంధించిన బకాయిలు. మూడు మిల్లుల్లో ధాన్యం పక్కదారి పట్టినట్లు అధికారులు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుటుంబ సభ్యుల పేరిట ఉన్న మిల్లులు కూడా ఇందులో ఉన్నాయి.

Akbaruddin Owaisi : బీఆర్ఎస్, కాంగ్రెస్ ముస్లిం అభ్యర్థిని గెలిపించలేకపోయాయి : అక్బరుద్దీన్ ఓవైసీ