MLA Sunitha Lakshma Reddy
Sunitha Lakshma Reddy : మహిళలను అవమానించడమే ఇందిరమ్మ రాజ్యమా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. మంత్రులు మహిళా అధికారులను ఇంటికి పిలుచుకొని సమీక్షలు చేస్తున్నారని.. మహిళా అధికారులు ఇబ్బందులు పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలను, ఎమ్మెల్యేలను, అధికారులను మంత్రులను అగౌరవ పరుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని అన్నారు.. కానీ, మహిళలను అవమానించడమే ఇందిరమ్మ రాజ్యమా అని సునీతా లక్ష్మారెడ్డి ప్రశ్నించారు.
Also Read: Kodali Nani : తిరుమల శ్రీవారి సేవలో కొడాలి నాని.. వీడియో చూశారా.. ఏంటి ఇలా అయ్యారు..!
మహిళా అధికారులను మంత్రులు ఇంటికి పిలిపించుకొని రివ్యూ చేశారని వచ్చిన వార్తలపై విచారణ చేపట్టాలని మహిళా కమిషన్‌కి ఫిర్యాదు చేశామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎస్ శాంతి కుమారికి ఉన్నత పదవి కట్టబెట్టామని, కానీ, ఈ ప్రభుత్వం అనేక విధాలుగా మహిళా అధికారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సునీతా లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళా ప్రజాప్రతినిధులపై కూడా గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. సీఎం వద్దకు వెళ్లాలి అంటే తన తల్లి మహిళా మంత్రి భయపడుతున్నారని ఆమె కుమార్తె ఇటీవల పేర్కొన్నారు. మహిళా జర్నలిస్టులపై దాడులు చేశారు. కేసులు కూడా పెట్టారు. కొత్తగూడెంలో గిరిజన మహిళను వివస్త్ర చేసిన ఘటన వెలుగు చూసింది.
సీఎం ఢిల్లీ నివాసంలో అధికారినికి కలిసే అవకాశం కూడా ఇవ్వకుండా అవమానించారు. మహిళలను కోటీశ్వరులను చేయకపోయినా పర్వాలేదు.. మహిళల హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించొద్దని ప్రభుత్వానికి సూచించారు. గురుకులాల్లో విద్యార్థినులు వేధింపులకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు ఏం అయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు.