Hyderabad Police: న్యూఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసుల ఆంక్షలివే.. రాత్రి 10గంటల వరకే..

Hyderabad Police : 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2026ను స్వాగతిస్తూ న్యూఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు నగర వాసులు సిద్ధమవుతున్నారు.

Hyderabad Police: న్యూఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసుల  ఆంక్షలివే.. రాత్రి 10గంటల వరకే..

Hyderabad Police

Updated On : December 13, 2025 / 1:42 PM IST

Hyderabad Police : 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2026ను స్వాగతిస్తూ న్యూఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు నగర వాసులు సిద్ధమవుతున్నారు. నూతన సంవత్సరం వేడుకల కోసం హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లోని పబ్ లు, రిసార్టులు, హోటళ్లు సిద్ధమవుతున్నాయి. అయితే, న్యూఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.

డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి నుంచి జనవరి 1వ తేదీ వరకు జరిగే వేడుకలపై ఆంక్షలు విధించారు. వేడుకలకోసం స్టార్ హోటళ్లు, క్లబ్బులు, పబ్‌లు ముందుగానే అనుమతి తీసుకోవాలని నగర పోలీసులు స్పష్టం చేశారు. వేడుకల నిర్వహణలో సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది, ట్రాఫిక్ నియంత్రణ తప్పనిసరిగా చూసుకోవాలని అన్నారు.

రాత్రి 10గంటల తరువాత అవుట్‌డోర్ సౌండ్ సిస్టమ్స్‌కు అనుమతి లేదని.. ఇండోర్ కార్యక్రమాలు మాత్రమే రాత్రి ఒంటి గంట వరకు నిర్వహించుకోవచ్చునని పోలీసులు పేర్కొన్నారు. అయితే, మైనర్లకు ప్రవేశం నిషేదమని చెప్పారు.

డ్రగ్స్, అశ్లీల కార్యక్రమాలు, ఫైర్ వర్క్స్‌కు పూర్తిగా నిషేధం విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని నగర పోలీసులు హెచ్చరించారు. న్యూఇయర్ వేడుకలు సురక్షితంగా, క్రమబద్దంగా జరగాలని, నిర్వాహకులు, ప్రజలు పోలీసులకు పూర్తిగా సహకరించాలని హైదరాబాద్ పోలీసులు తెలిపారు.