Kodali Nani : తిరుమల శ్రీవారి సేవలో కొడాలి నాని.. వీడియో చూశారా.. ఏంటి ఇలా అయ్యారు..!
Kodali Nani వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు కొండాలి నాని, పేర్ని నానిలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Kodali Nani
Kodali Nani : మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని అంటే తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితమైన వ్యక్తి. వైసీపీ ప్రభుత్వం హయాంలో మంత్రిగా పనిచేసిన కొడాలి నాని.. టీడీపీ, జనసేన నేతలపై ఓ రేంజ్ లో విరుచుకుపడేవారు. వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత రాజకీయంగా యాక్టివ్ గా కనిపించడం లేదు. దీనికితోడు ఇటీవల నాని తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారు. అయితే, తాజాగా.. కొడాలి నాని తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
సోమవారం ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు కొండాలి నాని, పేర్ని నాని తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. ఉదయం వీఐపీ సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి దర్శనంకు ముందు కొడాలి నాని స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
కొడాలి నాని ఆలయం వెలుపల భక్తులను పలకరిస్తూ కనిపించారు. ఎప్పుడూ ఒత్తైన జుట్టు, గుబురు గడ్డంతో కనిపించే కొడాలి నాని.. స్వామివారికి తలనీలాలు సమర్పించడంతో కాస్త డిఫరెంట్ గా కనిపించారు. దీంతో అక్కడ భక్తులు సైతం ఆయన్ను చూసి ఒకింత ఆశ్చర్య పోయారు. అంతేకాదు.. కొడాలి నాని, పేర్ని నానిలతో సెల్ఫీలు దిగేందుకు కొందరు పోటీపడ్డారు. దీంతో వారితో కరచాలనం చేస్తూ కొడాలి, పేర్ని నానిలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
