మంచిర్యాల జిల్లా ఫారెస్ట్ అధికారులకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వార్నింగ్ ఇచ్చారు. ఎఫ్‌డీపీటీ శాంతారాంతో పాటు ఫారెస్ట్ సిబ్బంది ప్రజలను వేధిస్తున్నారని వెడ్మ బొజ్జు మండిపడ్డారు.
“నా ఓపిక నశిస్తే ఒక్కొక్కరి బొక్కలు ఇరుగుతాయ్. సిరిచెల్మ, ముల్తానీ రైతుల తరహా ఫారెస్ట్ సిబ్బందిపై దాడులు చేస్తాం. దానికి నేనే ముందుండి నాయకత్వం వహిస్తా. అటవీశాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఊరుకోము.
కవ్వాల్ నుంచి టేకు, ఇసుక, కట్టే ఎక్కడెక్కడికి వెళ్తుందో నాకు అన్ని తెలుసు. పోడు భూములను వదులుకొనే ప్రసక్తే లేదు. జీవో.49 అమలు అయితే నేనే రాజీనామా చేస్తా. నా ఇలాఖాలో ఇష్టమొచ్చినట్టు చేస్తానంటే ఊరుకునేది లేదు” అని వార్నింగ్ ఇచ్చారు.
జన్నారం సామాజిక సాధన సమితిపై సైతం వెడ్మ బొజ్జు ఆగ్రహం వ్యక్తం చేశారు. “జనాలను ఇబ్బంది పెట్టేలా ఎందుకు బంద్ లు చేస్తున్నారు? ఎవరో చెప్పింది విని జన్నారం బంద్ కి పిలుపునిస్తారా? బంద్ నాటకం బీఆర్ఎస్ పార్టీదే. జనాలను ఇబ్బంది పెట్టడం తప్ప బంద్‌తో ఒరిగేదేమీ లేదు” అని అన్నారు.