MLC Kavitha-Delhi liquor scam: విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత.. ఆమెతో పాటు ఈడీ ఆఫీసుకి భర్త అనిల్

ఢిల్లీ లిక్కర్ స్కాం​ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ విచాణకు హాజరయ్యారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఆమె చేరుకుని లోపలికి వెళ్లారు. కవితతో పాటు ఈడీ కార్యాలయానికి ఆమె భర్త అనిల్ కూడా వెళ్లడం గమనార్హం. అలాగే, వారితో న్యాయవాది భరత్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఉన్నారు. కవిత విచారణకు హాజరవుతారని ఇవాళ ఉదయం బీఆర్ఎస్ వర్గాలు కూడా తెలిపాయి.

MLC Kavitha-Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం​ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ విచాణకు హాజరయ్యారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఆమె చేరుకుని లోపలికి వెళ్లారు. కవితతో పాటు ఈడీ కార్యాలయానికి ఆమె భర్త అనిల్ కూడా వెళ్లడం గమనార్హం. అలాగే, వారితో న్యాయవాది భరత్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఉన్నారు. అరుణ్ పిళ్లైతో కలిసి కవితను ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. కవిత విచారణకు హాజరవుతారని ఇవాళ ఉదయం బీఆర్ఎస్ వర్గాలు కూడా తెలిపాయి.

ఈ నెల 16న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా, సుప్రీంకోర్టులో కేసు కారణంగా విచారణకు రాలేనని తెలిపిన విషయం తెలిసిందే. ఈడీ కార్యాలయంలో మహిళలను విచారించడంపై ఈ నెల 24న సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో ఆ విచారణ అనంతరమే హాజరవుతానని అన్నారు. అయితే, అదే రోజు కవితకు ఈడీ మరోసారి నోటీసులు పంపింది.

దీంతో ఇవాళ కవిత విచారణకు హాజరయ్యారు. ఈడీ విచారణలో ఆమె పాల్గొనడం ఇది రెండోసారి. ఇవాళ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో ఆమె లీగల్ టీమ్ తో మరోసారి చర్చించినట్లు తెలుస్తోంది. ఢిల్లీకి ఆమె పలువురితో కలిసి నిన్ననే వెళ్లారు. కవిత ఢిల్లీ, తుగ్లక్ రోడ్డులోని సీఎం కేసీఆర్ నివాసంలో ఉన్నారు. కొందరు మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లారు. అలాగే, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్‌‌‌‌ఎస్ ఎంపీలంతా ఢిల్లీలో ఉన్నారు.

ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50 కింద కవిత స్టేట్ మెంట్ ను ఈడీ రికార్డు చేయనుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సౌత్ గ్రూప్ నుంచి కవితను కీలక వ్యక్తిగా ఈడీ పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కాం లో సౌత్ గ్రూప్ పాత్ర,100 కోట్ల ముడుపుల వ్యవహారాలు, నిందితులతో సంబంధాలు, డీలర్ కమిషన్ పెంచడం, లిక్కర్ వ్యాపారులకు అనుకూలంగా పాలసీలో మార్పులపై ఢిల్లీ, హైదరాబాద్ లో జరిగిన సమావేశాలపై కవితను ఈడీ ప్రశ్నించనుంది. ఇప్పటికే బాంక్ స్టేట్ మెంట్స్ సహా ఈడీ అడిగిన 12 డాక్యుమెంట్లను కవిత అందజేశారు. లిక్కర్ స్కాంలో తన పాత్ర లేదని.. ఎవరో ఇచ్చిన స్టేట్ మెంట్స్ ద్వారా తనను ఇరికిస్తున్నారని కవిత అంటున్నారు.

AP Assembly Budget Session-2023.. 7th Day: అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. టీడీపీ ఎమ్మెల్యేను నెట్టేసిన వైసీపీ సభ్యుడు.. Live Updates

ట్రెండింగ్ వార్తలు