MLC Kavitha-Delhi liquor scam: కవితతో పాటు పిళ్లైను విచారిస్తున్న ఈడీ.. కోర్టులో పిళ్లైను హాజరుపర్చే ఛాన్స్

ఢిల్లీ లిక్కర్ స్కాం​ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇవాళ ఉదయం 11 గంటల నుంచి ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఆమెతో పాటు అరుణ్ పిళ్లైను కూడా అధికారులు విచారిస్తున్నారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి కవిత వెళ్లిన విషయం తెలిసిందే. విచారణ ముగిశాక రౌస్ అవెన్యూ కోర్టులో పిళ్లైను ఈడీ హాజరుపర్చనుంది. ఆయనను కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ కు అప్పగించే అవకాశం ఉంది.

MLC Kavitha-Delhi liquor scam

MLC Kavitha-Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం​ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇవాళ ఉదయం 11 గంటల నుంచి ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఆమెతో పాటు అరుణ్ పిళ్లైను కూడా అధికారులు విచారిస్తున్నారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి కవిత వెళ్లిన విషయం తెలిసిందే. విచారణ ముగిశాక రౌస్ అవెన్యూ కోర్టులో పిళ్లైను ఈడీ హాజరుపర్చనుంది. ఆయనను కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ కు అప్పగించే అవకాశం ఉంది.

ఇవాళ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50 కింద కవిత స్టేట్ మెంట్ ను ఈడీ రికార్డు చేసింది. సౌత్ గ్రూప్ నుంచి కవితను కీలక వ్యక్తిగా ఈడీ ఇప్పటికే పేర్కొంది. సౌత్ గ్రూప్ పాత్ర,100 కోట్ల ముడుపుల వ్యవహారాలు, నిందితులతో సంబంధాలు వంటి అంశాలపై కవితను ఈడీ ప్రశ్నించింది.

ఇవాళ కవితతో పాటు ఈడీ కార్యాలయానికి ఆమె భర్త అనిల్ కూడా వెళ్లారు. కాగా, ఈ నెల 16న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా ఆమె హాజరుకాలేదు. దీంతో ఆమెకు మళ్లీ ఈడీ నోటీసులు జారీ చేయడంతో ఇవాళ హాజరయ్యారు. ఈడీ కార్యాలయంలో మహిళలను విచారించడంపై ఈ నెల 24న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

Railway Station: ఛీ.. ఛీ..! రైల్వే స్టేషన్‌లో కళ్లు మూసుకున్న ప్రయాణీకులు.. మూడు నిమిషాలు రచ్చరచ్చ..