Hakimpet Sports School
Minister Srinivas Goud: హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్‌లో బాలికపై అక్కడి అధికారి లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తక్షణమే పూర్తి విచారణ జరిపి బాధితురాళ్లకు న్యాయం చేయాలని క్రీడాశాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కవిత ట్విటర్ వేదికగా కోరారు. వెంటనే స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘటనపై విచారణ చేస్తున్నామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Crime News: ప్రసిద్ధ పుణ్యక్షేత్ర సమీపంలో 12 ఏళ్ల బాలికను ఘోరాతి ఘోరంగా..
నన్ను ఎంతో కలిచివేసిందన్న ఎమ్మెల్సీ కవిత ..
హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్‌లో బాలికపై అక్కడి అధికారి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఆరోపణలు రావడంతో ట్విటర్ వేదికగా ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈమేరకు ఆదివారం ఉదయం ఆమె ట్వీట్ చేశారు. ‘ ఒక పత్రికలో వచ్చిన కథనం నన్ను ఎంతో కలిచివేసింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వంలో ఇలాంటి వారికి తావు ఉండకూడదు. బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై తక్షణం చర్యలు చేపట్టాలి. పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధితురాళ్లకు న్యాయం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కవిత కోరారు. ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని తక్షణమే సస్పెండ్ చేస్తాం. ఆరోపణలపై ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని చెప్పారు.
Crime News: పార్కులో ఉన్న అమ్మాయిని అతి దారుణంగా చంపేసిన యువకుడు
అధికారిని సస్పెండ్ చేశాం..
లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణకు ఆదేశించామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న హరికృష్ణ అనే అధికారిని స్సపెండ్ చేశాం. విచారణ రెండు మూడురోజుల్లో పూర్తిచేస్తాం. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. వారికి సహకరించిన వారిని కూడా వదలం అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని మేము ఢిల్లీలో కోరాం. కానీ అది జరగలేదు. ఇక్కడ ఉదయం 7గంటలకు విషయం తెలిస్తే అప్పుడే చర్యలు తీసుకున్నాం. ఘటన రుజువైతే జైలుకు పంపిస్తాం. అవసరం అయితే ఉరి తీయిస్తాం అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా వదలమని, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే సత్వరం చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అయితే, ఈ ఘటనపై మాకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మంత్రి తెలిపారు.